https://oktelugu.com/

Ambati Rayudu: క్రికెట్ కంటే పాలిటిక్స్ కష్టమని తెలుసుకున్న రాయుడు.. అందుకే వైదొలిగాడా?

రాజకీయాల వైపు ఆయన దృష్టి పెట్టడానికి ప్రధాన కారణం ఇండియా సిమెంట్స్ చీఫ్ శ్రీనివాసన్. చెన్నై సూపర్ కింగ్ టీం ఓనర్ ఆయనే. ఆయన ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి అరంగేట్రం చేయాలని అంబటి రాయుడు ఒక నిర్ణయానికి వచ్చారు.

Written By: Dharma, Updated On : October 8, 2023 10:14 am

Ambati Rayudu

Follow us on

Ambati Rayudu: అంబటి రాయుడు క్రికెట్ పై ఫోకస్ పెంచారా? రాజకీయాల్లో రాణించడం అంత ఈజీ కాదనుకుంటున్నారా? ముందుగా వచ్చి తప్పు చేశానని భావిస్తున్నారా? పొలిటికల్ ఇమేజ్ నీటిలో బుడగలా భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం అంబటి రాయుడు ఎక్కడా కనిపించకపోవడంతో అందరూ ఆరా తీయడం ప్రారంభించారు. అయితే ఆయన విదేశాల్లో కొన్ని లీగ్ మ్యాచు ల్లో ఆడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ చివరి మ్యాచ్ రోజునే రిటైర్మెంట్ ప్రకటించి.. ఆ తర్వాత రోజే నేరుగా సీఎం జగన్ కలిసి తన రాజకీయ ఆసక్తిని కనబరిచారు. అయితే తొలినాళ్లలో దూకుడు మీద ఉన్న ఆయన.. ప్రస్తుతం కనుమరుగు కావడం చర్చనీయాంశంగా మారింది.

రాజకీయాల వైపు ఆయన దృష్టి పెట్టడానికి ప్రధాన కారణం ఇండియా సిమెంట్స్ చీఫ్ శ్రీనివాసన్. చెన్నై సూపర్ కింగ్ టీం ఓనర్ ఆయనే. ఆయన ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి అరంగేట్రం చేయాలని అంబటి రాయుడు ఒక నిర్ణయానికి వచ్చారు.తన మనసులో ఉన్న మాటను జగన్ వద్ద బయటపెట్టారు. యంగ్ క్రికెటర్ కావడంతో ఫేమ్ పార్టీకి పనికొస్తుందని భావించిన జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.పెదకూరపాడు అసెంబ్లీ సీటును కేటాయిస్తారని కూడా టాక్ నడిచింది.

ఆ మధ్యన కొద్ది రోజులపాటు అంబటి రాయుడు గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించారు. ఐ ప్యాక్ టీం పర్యవేక్షణలో ఆయన పర్యటనలు సాగాయి. అయితే ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకుండా పోయిందన్న టాక్ నడిచింది. మరోవైపు భారీగా ఖర్చు పెట్టాల్సి రావడంతో రాయుడు బెంబేలెత్తిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎన్నికల ముంగిట పార్టీలో చేరి టికెట్ సాధిస్తే చాలని.. ఇప్పుడు నుంచి కానీ యాక్టివ్ అయితే ఆర్థికంగా భారం పడుతుందని సన్నిహితులు సలహా ఇచ్చినట్లు సమాచారం. దీంతో రాయుడు తిరిగి క్రికెట్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం విదేశాల్లో లీగ్ మ్యాచ్లు ఆడుతున్నట్లువిశ్వసనీయ సమాచారం. మొత్తానికైతే క్రికెట్ అంతా ఈజీ రాజకీయాలు కాదని రాయుడు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.