spot_img
Homeజాతీయ వార్తలుDharmendra Pradhan Resignation: ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా.. స్టేజీపై కాక్రోచ్‌ల వికటట్టహాసం.. వైరల్‌ వీడియో

Dharmendra Pradhan Resignation: ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా.. స్టేజీపై కాక్రోచ్‌ల వికటట్టహాసం.. వైరల్‌ వీడియో

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలితం ఇచ్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూలై 25న తన పదవికి రాజీనామా ఏశారు. మంత్రి రాజీనామా వార్త వచ్చిన వెంటనే ఢిల్లీ జంతర్‌ మంతర్‌లోని నిరసన వేదికపై అసాధారణ దృశ్యాలు చోటుచేసుకున్నాయి. కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) కార్యకర్తలు స్టేజీపైకి ఎక్కి వికటమైన నవ్వులతో సంబరాలు చేసుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్‌ అవుతున్నాయి.

స్టేజీపై వెకిలి చేష్టలు..
మంత్రి రాజీనామా వార్త వినగానే నిరసనకారులు తమ వేదికపైకి ఎక్కి గెంతులేశారు. కొందరు తమ తలలను స్టేజీకి బాదుకున్నారు. కొందరు విజయం సాధించామన్న గర్వంతో చేతులు పైకెత్తి డ్యాన్స్‌ చేశారు. సీజేపీ సభ్యులు స్టేజీపై ఎక్కి గట్టిగా నవ్వుతూ, చప్పట్లు కొడుతూ కనిపించారు. ఈ దృశ్యాలు చాలా మందికి ఆశ్చర్యం కలిగించాయి. నీట్‌ పేపర్‌ లీకేజీ కారణంగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఇంతకాలం తమ నిరసణలో భావోద్వేగంతో మాట్లాడిన సీజేపీ నేతలంతా ఇప్పుడు వెకిలిగా నవ్వడం, గెంతులు వేయడం, సంబురాలు చేసుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది.

కాక్రోచ్‌ ఉద్యమం ఇలా..
సీజేపీ మొదట సామాజిక మాధ్యమాల్లో వ్యంగ్య పోస్టులతో ప్రారంభమైంది. తర్వాత జంతర్‌ మంతర్‌లో నిరంతర నిరసనగా మారి, విద్యార్థుల అసంతృప్తిని జాతీయ స్థాయికి తీసుకువచ్చింది. నీట్‌ పేపర్‌ లీక్‌పై బాధ్యత వహించాలని మంత్రి రాజీనామానే ప్రధాన డిమాండ్‌గా పెట్టుకుని పోరాటం కొనసాగించారు. చర్చలు, గడువులు, ఒత్తిడి అన్నీ కలిసి చివరకు రాజీనామాకు దారితీశాయి. ఆ తర్వాత స్టేజీపై చూపిన ఈ ప్రవర్తన వారి ఉద్యమ శైలికి భిన్నంగా ఉంది.

వికాటాట్టహాసం ఎందుకు..
ప్రజాస్వామ్యంలో ప్రజల ఒత్తిడికి ఎంతటి పాలకులైనా తలొగ్గాల్సిందే. రాజీనామా డిమాండ్‌ రాగానే ఎవరూ రాజీనామా చేయరు. పూర్వపరాలు పరిశీలిస్తారు. వ్యతిరేకత తగ్గేలా పాలకులు ప్రవర్తిస్తారు. ఫలించని పక్షంలో రాజీనామా చేస్తారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ విషయంలో కూడా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇదే చేసింది. కానీ సీజేపీ మంత్రి రాజీనామా తర్వాత ప్రవర్తించిన తీరే ఇప్పుడు మరో చర్చకు దారితీశాయి. ఇంత వికాటాట్టహాసం ఎందుకు అని నెటిజన్లు ప్రశినస్తున్నారు. ఈ విజయాన్ని ప్రాణాలు వదిలిన విద్యార్థులకు అంకితమివ్వాలని సూచిస్తున్నారు. ఇది ఏ ఒక్కరి విజయం కాదని, విద్యార్థులు, యువత సమష్టి పోరాట ఫలితం అని సూచిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...
OnePlus N6x

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...
POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Social Companionship

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Oktelugu Epaper