Homeజాతీయ వార్తలుMaharashtra CM : మహా’ ఉత్కంఠకు తెర.. అందరూ ఊహించినట్లే నేతకే సీఎం పగ్గాలు..!

Maharashtra CM : మహా’ ఉత్కంఠకు తెర.. అందరూ ఊహించినట్లే నేతకే సీఎం పగ్గాలు..!

Maharashtra CM :  మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కూటమి విజయం సాధిస్తుంది అన్న ఉత్కంఠకు నవంబర్‌ 23న తెరపడింది. అసెంబ్లీ ఎన్నికలపై రెండు నెలలుగా టెన్షన్‌ నెలకొంది. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో శివసేన(షిండే), ఎన్‌సీపీ(అపిత్‌పవార్‌) పార్టీ కలిసి పోటీ చేశాయి. ఇక కాంగ్రెస్‌ నేతృత్వంలో శివసేన(ఉద్ధవ్‌ థాక్రే), ఎన్‌సీపీ (శరద్‌పవార్‌) పార్టీలు మరో కూటమిగా పోటీ చేశాయి. ఈఎన్నికల్లో మహారాష్ట్ర ఓటర్లు మహాయుతి కూటమిని భారీ మెజారిటీతో గెలిపించారు. 288 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 230 స్థానాలు మహాయుతి గెలిచింది. ఇంతటి భారీ విజయం సాధించిన కూటమి సీఎం అభ్యర్థిని ప్రకటించడంపై తీవ్ర జాప్యం చేసింది. సుమారు పది రోజులు చర్చోప చర్చలు జరిపిన అనంతరం ఎట్టకేలకు సీఎంను ప్రకటించింది.

అందరూ ఊహించినట్లుగానే…
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ 135 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఇక మహాయుతి కూటమిలోని శివసేన 52, ఎన్‌సీపీ 40 స్థానాల్లో విజయం సాధించాయి. కూటమిలోనూ బీజేపీ ఎక్కువ స్థానల్లో గెలవడంతో సీఎం పదవి కోసం సహసంగానే పట్టుపట్టింది. మరోవైపు మాజీ సీఎం ఏక్‌నాథ్‌సిండే కూడా సీఎం పదవి కావాలని పట్టుపట్టారు. ఈ నేపథ్యంలో సీఎం ఎంపిక ప్రక్రియ క్లిష్టంగా మారింది. రంగంలోకి దిగిన బీజేపీ పెద్దలు షిండోతోపాటు అజిత్‌పవార్‌తో చర్చలు జరిపారు. అనేక ప్రతిపాదనలు తెచ్చారు. పలు దఫాల చర్చల అనంతరం బీజేపీ నేతకే సీఎం పదవి దక్కింది. మాజీ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను బీజేపీ నేతలు సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. బుధవారం(డిసెంబర్‌ 4న) జరిగిన శాసన సభాపక్ష సమావేశంలో బీజేఎల్పీ నేతగా ఫడ్నవీస్‌ను ఎన్నుకున్నారు.

డిప్యూటీ సీఎంలుగా ఇద్దరు..
ఇక డిప్యూటీ సీఎంలుగా ప్రస్తుత ఆపద్ధర్మ సీఎం శివసేన చీఫ్‌ ఏక్‌నాథ్‌షిండే, ఎన్‌సీపీ నేత అజిత్‌పవార్‌ ఉండనున్నారు. షిండే డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించిన తర్వాతే సీఎం పదవికి లైన్‌ క్లియర్‌ అయింది. దీంతో ఫడ్నవీస్‌ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం(డిసెంంబర్‌ 5న) ముంబైలోని ఆజాద్‌ మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈమేరకు మహాయుతి నేతలు బుధవారం గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version