https://oktelugu.com/

టీడీపీ నేతల్లో తీరని వేదన

టీడీపీలో ముసలం రేగుతోంది. అధినేత తీరుతో అందరిలో ఆవేదన పెరుగుతోంది. పార్టీ కోసం కష్టపడే వారికి సముచిత ప్రాధాన్యం ఇవ్వడం లేదని వాపోతున్నారు. తమని కాదని జూనియర్లకు పట్టం కట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీకి విధేయులుగా ఉన్నా ఆపదకాలంలో ఆదుకున్నా పట్టించుకోవడం లేదని బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. పార్టీ ఎదుగుదలకు అనుక్షణం కాపాడిన తమ ప్రభావాన్ని గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్ కు ఉపాధ్యక్ష పదవి? వచ్చే మహానాడులో నారా లోకేష్ […]

Written By: , Updated On : May 15, 2021 / 06:42 PM IST
Follow us on

TDP Leadersటీడీపీలో ముసలం రేగుతోంది. అధినేత తీరుతో అందరిలో ఆవేదన పెరుగుతోంది. పార్టీ కోసం కష్టపడే వారికి సముచిత ప్రాధాన్యం ఇవ్వడం లేదని వాపోతున్నారు. తమని కాదని జూనియర్లకు పట్టం కట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీకి విధేయులుగా ఉన్నా ఆపదకాలంలో ఆదుకున్నా పట్టించుకోవడం లేదని బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. పార్టీ ఎదుగుదలకు అనుక్షణం కాపాడిన తమ ప్రభావాన్ని గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నారా లోకేష్ కు ఉపాధ్యక్ష పదవి?
వచ్చే మహానాడులో నారా లోకేష్ కు ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టేందుకు చంద్రబాబు భావిస్తున్నారు. ఇదే అదనుగా ఆయన స్థాయి పంచేందుకు పావులు కదుపుతున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ కు అదనపు బాధ్యతలు అప్పగించి పార్టీలో తన స్థాయిని పెంచే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. దీంతో లోకేష్ ను రంగంలోకి దింపి టీడీపీ రథసారధిగా బాధ్యతలు అప్పగించే పనిలో చంద్రబాబు ఉన్నారని సీనియర్ నాయకులు చెబుతున్నారు.

సీనియర్లకు ప్రాధాన్యం
పార్టీ ఎదుగుదలకు కారణమైన సీనియర్లను గుర్తించి వారు పార్టీని వీడకుండా చూసేందుకు చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. తన కుమారుడికి పట్టం కడుతూనే సీనియర్లను అక్కున చేర్చుకోవాలని చూస్తున్నారు. సీనియర్లు లేకపోతే పార్టీ కష్టాల పాలవుతుందని గ్రహించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పార్టీ విధేయులుగా సీనియర్ల సేవలను గుర్తించి వారికి సముచిత ప్రాధాన్యత గల పదవులు ఇవ్వాలని చూస్తున్నారు.

చంద్రబాబుపైనే..
టీడీపీ విజయం చంద్రబాబు పైనే ఆధారపడి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో చేపట్టబోయే పథకాలు, ప్రయోజనాలు, నిర్ణయాలు ఏ మేరకు ఉంటాయోనని ఇప్పటి నుంచే అంచనాలు వేస్తున్నారు. పార్టీ గత వైభవం సాధించేందుకు కష్టపడాలి. వైసీపీ పథకాలు, నిర్ణయాలు చూస్తుంటే టీడీపీ నాయకులకు అనుమానాలు కలుగుతున్నాయి. ఈసారైనా అధికారం దక్కుతుందా అనే అంచనాల్లో తలమునకలవుతున్నారు. ప్రత్యర్థి పార్టీల బలాబలాలపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తున్నారు. ఎవరి బలం ఎంత? ఏ మేరకు ప్రభావం చూపుతారోనని భావిస్తున్నారు. ఏది ఏమైనా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పార్టీ చురుకైన పాత్ర పోషించేలా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరంపై అడుగులు వేస్తున్నారు. ఎలాగైనా అధికారమనే సోపానాన్ని అందుకోవడమే ధ్యేయంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం.