Maharashtra-Jharkhand Election 2024 : దేశంలో రెండు నెలలుగా ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డా. రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు శనివారం(నవంబర్ 23న) జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల ప్రకారం.. మహారాష్ట్రలోని 288 స్థానాల్లో మహాయుతి కూటమి 217 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహాయుతి అఘాడీ కేవలం 53 స్థానాలకు పరిమితమైంది. ఇక జార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ ఎన్నికల్లో జేఎంఎం కూటమి 51 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ కేవలం 29 స్థానాలకు పరిమితమైంది. దీంతో రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాట్లుకు ఇటు బీజేపీ, అటు జేఎంఎం కూటమి సన్నాహాలు చేసుకుంటున్నాయి.
తెలుగు నేతల ప్రచారం..
ఇదిలా ఉంటే.. రెండు రాస్ట్రాల ఉప ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల నేతలు కాంగ్రెస్, బీజేపీ తరఫున ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్‌గా ప్రకటించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను జార్ఖండ్ స్టార్ క్యాంపెయినర్‌గా ప్రకటించింది. ఇక బీజేపీ మహారాష్ట్ర స్టార్ క్యాంపెయిన్ జాబితాలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ప్రకటించింది. దీంతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ తరఫు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ తరఫున మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేశారు. సభలు, ర్యాలీల్లో పాల్గొన్నారు. ఇక తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జార్ఖండ్‌లోని పలునియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. ర్యాలీలు, రోడ్‌షోలలో పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎంలు సక్సెస్..
తెలుగు రాష్ట్రాల డిప్యూటీ సీఎంలు ఎన్నికల ప్రచారంలో సక్సెస్ అయ్యారు. మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ పూణే, లాతూర్, బర్లాపూర్, డెగ్లూర్, షోలాపూర్‌లో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు. సనాతన ధర్మంపై విస్తృతంగా ప్రచారం చేశారు. శివాజీ సిద్ధాంతాలను కాపాడుకోవాలంటే బీజేపీని గెలిపిచాలని కోరారు. ఆయన ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది. దీంతో పవన్ మహారాష్ట్ర ఎన్నికల్లోనూ 100 శాతం స్ట్రైక్‌రేట్ సాధించారు. ఇక తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారం చేశారు. ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించారు. జార్ఖండ్ భవిష్యత్ కోసం ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు. దీంతో జార్ఖండ్‌లో కూడా కాంగ్రెస్ మంచి సీట్లే సాధించింది. కాంగ్రెస్ 15 స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్తోంది.
సీఎం ప్రచారం చేసిన అన్ని చోట్ల ఓటమి..
ఇక తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మహారాష్ట్రలోని పూణె, నాగపూర్, చంద్రాపూర్, షోలాపూర్‌తోపాటు పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ర్యాలీల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులతో కలిసి రోడ్‌షో చేశారు. అంతే కాదు.. తెలంగాణలో అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల గురించి మహారాష్ట్రలోని పత్రికల్లో ప్రకటనలు కూడా వేయించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలిస్తే ఐదు గ్యారంటీలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. కానీ, రేవంత్‌రెడ్డి ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఇక కోట్ల రూపాయలతో అక్కడి పత్రికల్లో వేసిన ప్రకటనలు కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. ఇక్కడ కాంగ్రెస్ కూటమి కేవలం 55 స్థానాలకే పరిమితమైంది.కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా 19 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.