తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్న పాటను ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి అక్షరాల అప్లై చేయొచ్చు అన్న టాక్ నడుస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారాయణ స్వామి ఆలయం ఎదుట మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ను తిట్టబోయి పొరపాటున జగన్ ను తిట్టేశాడు. ఇక ఆ వీడియో ఆగుతుందా.? టీడీపీ, జనసేన సోషల్ మీడియా ఉద్యమకారులు ఇప్పుడు నెట్ లో ట్రెండ్ చేసేస్తున్నారు. మీమ్స్ తో హోరెత్తిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ను తిట్టబోయి సొంత పార్టీ అధినేత జగన్ ను ఉద్దేశించి నారాయణ చేసిన కామెంట్స్ వీడియో వైరల్ అవుతోంది. ‘‘జగన్ దాడి చేసేది ఏంటి.. ప్రజలే జగన్ పై దాడిచేసే రోజులు రాబోతున్నాయి.. జగన్ ప్రజలపై దాడి చేయడం కాదు.. ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు త్వరలో ఉన్నాయి.’’ అని పవన్ ను అనబోయి జగన్ ను అనేసిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అడ్డంగా బుక్కయ్యారు.
ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని సోషల్ మీడియాలో ఓ ఆట ఆడేస్తున్నారు. ఆయన ‘మనసులో మాట చెప్పారు’ అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు.
https://twitter.com/SreenivasC14/status/1443060885832957958?s=20
పవన్ ను తిట్టబోయి జగన్ ను తిట్టారని పక్కనున్న వారు గుర్తు చేయడంతో నాలుక కరుచుకున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అనంతరం పవన్ పై విరుచుకుపడ్డారు. ‘క్యారెక్టర్ లేని పవన్ గురించి మాట్లాడడం నా వ్యక్తిత్వానికే లోటు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళల అన్యాయాల గురించి ప్రశ్నిస్తు పవన్ ముందు ఆయన ద్వారా నష్టపోయిన మహిళల గురించి ముందు మాట్లాడాలని ఎదురుదాడి చేశారు. ఆయన మహిళలను ఏవిధంగా హింసించారో ప్రజలే చూస్తున్నారని తెలిపారు.
ఇలా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పవన్ ను తిట్టబోయి జగన్ ను తిట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్రెండ్ అవుతోంది.
