https://oktelugu.com/

Mallu Bhatti Vikramarka: దొర గడీ నుంచి.. దళితుడి అధికారిక నివాసంగా.. డిప్యూటీ సీఎంకు ప్రజాభవన్‌.. ప్రభుత్వం ఉత్తర్వులు!

దాదాపు బీఆర్‌ఎస్‌ పాలనంతా ఇలాగే సాదింది. కానీ ప్రజలు తమ ఓటుతో ఇచ్చిన తీర్పుతో తెలంగాణలో పాలకుల మారిపోయారు. బీఆర్‌ఎస్‌ ఓడిపోయింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 13, 2023 / 04:19 PM IST

    Mallu Bhatti Vikramarka

    Follow us on

    Mallu Bhatti Vikramarka: తెలంగాణ ముఖ్యమంత్రి నివాసంగా ఉన్న ప్రగతి భవన్‌.. వారం క్రితం వరకు అది ఒక శత్రు దుర్భేద్యమైన గడి. కనీసం ఆ భవన్‌ ముంద సామాన్యుడు నిలబడే పరిస్థితి కూడా ఉండేది కాదు. ఇక అనుమతి లేకుంటే ప్రజాప్రతినిధులకే లోనికి అడుగు పట్టె అవకాశం ఉండేది కాదు. ఇక సామాన్యుడికి ఈ భవన్‌ ఎలా ఉంటుందో కూడా తెలియదు. అలా అని ఇది సొంత డబ్బుతు నిర్మించుకున్న భవనం అంతకన్నా కాదు. తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టిందే. కానీ, కేసీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో దీనిని ఒక గడీగా మార్చేశారు. తన సొంత ఇల్లులా.. తాను కష్టపడి సంపాదించిన డబ్బుతో కట్టుకున్నట్లుగా వ్యవహరించారు.

    ప్రజాతీర్పుతో కంచె బద్ధలు..
    దాదాపు బీఆర్‌ఎస్‌ పాలనంతా ఇలాగే సాదింది. కానీ ప్రజలు తమ ఓటుతో ఇచ్చిన తీర్పుతో తెలంగాణలో పాలకుల మారిపోయారు. బీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి డిసెంబర్‌ 7న ప్రమాణస్వీకారం చేశారు. అదేరోజు మధ్యాహ్నం ప్రగతిభవన్‌ కంచె బద్ధలు కొట్టించారు. ప్రగతి భవన్‌ పేరును మహాత్మ జ్యోతిబాపూలే ప్రజాభవన్‌గా మార్చేశారు.

    ప్రజాదర్బార్‌ నిర్వహణ..
    ఇక డిసెంబర్‌ 8న ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఇందులో సీఎం రేవంత్‌ స్వయంగా పాల్గొన్నారు. ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజాదర్బార్‌కు రాష్ట్రం నలుమూలల నుంచి తండోపతండాలుగా ప్రజలు తరలివచ్చారు. సీఎం రేవంత్‌కు సమస్యలపై అర్జీలు ఇచ్చారు. ఇదే సమయంలో దాదాపు పదేళ్ల తర్వాత ప్రజాభవన్‌ చూసే అవకావం రావడంతో మురిపిసోయారు.

    దొర నివాసం.. దళితుడికి..
    ఇన్నాళ్లూ దొర నివాసంగా ఉన్న ప్రజాభవన్‌(ప్రగతిభవన్‌) ఇప్పుడు దళితుడికి అధికారిక నివాసంగా మారింది. ప్రగతి భవన్‌ను తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కకు కేటాయిస్తూ ప్రభుత్వం డిసెంబర్‌ 13న ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాభవన్‌లో ఉంటారని అందరూ భావించారు. కానీ, ఆయన ఇక్కడ ఉండేందుకు విముఖత చూపారు. దీంతో అధికారులు ఆ భవనాన్ని డిప్యూటీ సీఎంకు కేటాయించారు. సీఎం కోసం మరో భవనం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. దొత్తంగా 9 ఏళ్లు దొర గడీగా ఉన్న ప్రజాభవన్‌ ఇప్పుడు దళితుడైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా మారింది. త్వరలోనే భట్టి ఇందులోకి మారే అవకాశం ఉంది.