‘పుష్ప’ నుంచి విజయ్‌ సేతుపతి ఔట్‌.. కారణమిదే

విజయ్‌ సేతుపతి. తమిళనాడులో మంచి స్టార్డమ్‌ ఉన్న హీరో. వైవిధ్యభరిత పాత్రలతో సౌత్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు. కథ నచ్చితే ఇమేజ్‌‌ను పక్కనబెట్టేసి ఎలాంటి పాత్రనైనా చేస్తాడు. సపోర్ట్‌ క్యారెక్టర్సే కాకుండా విలన్‌గానూ మెప్పిస్తున్నాడు. చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆయన… సాయిధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ‘ఉప్పెన’లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న […]

Written By: Neelambaram, Updated On : July 13, 2020 9:15 pm
Follow us on


విజయ్‌ సేతుపతి. తమిళనాడులో మంచి స్టార్డమ్‌ ఉన్న హీరో. వైవిధ్యభరిత పాత్రలతో సౌత్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు. కథ నచ్చితే ఇమేజ్‌‌ను పక్కనబెట్టేసి ఎలాంటి పాత్రనైనా చేస్తాడు. సపోర్ట్‌ క్యారెక్టర్సే కాకుండా విలన్‌గానూ మెప్పిస్తున్నాడు. చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆయన… సాయిధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ‘ఉప్పెన’లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘పుష్ప’లో కూడా సేతుపతి విలన్‌గా ఎంపికయ్యాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోందీ చిత్రం.

‘పుష్ప’ మొదట మహబూబ్ నగర్ లోనే..!

పాన్‌ ఇండియా మూవీ కాబట్టి విజయ్‌ ఉంటే తమిళ్‌లో మంచి ప్రమోషన్‌ లభిస్తుందని చిత్ర బృందం భావించింది. తీరా షూటింగ్‌ ప్రారంభమవడానికి ముందే విజయ్‌ ఈ మూవీ నుంచి తప్పుకున్నాడు. దీని గురించి రకరకాల కారణాలు వినిపించాయి. అయితే, ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడిన విజయ్ తాను ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్టు స్వయంగా వెల్లడించాడు. కాల్షీట్లు సర్దుబాబు చేయలేకపోవడం వల్లే వైదొలగాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు. ఇదే విషయాన్ని డైరెక్టర్ సుకుమార్ను పర్సనల్‌గా కలిసి వివరించానని తెలిపాడు. తనకు ‘పుష్ప’లో నటించాలని చాలా ఆసక్తిగా ఉన్నప్పటికీ…దానివల్ల తమిళ్‌లో ఇప్పటికే ఒప్పుకున్న చిత్రాలకు డేట్ల సమస్య రాకూడదని భావించానని చెప్పాడు. అందుకే తెలుగు మూవీని వదులుకోవాల్సి వచ్చిందని వివరించాడు. విజయ్‌ హీరోగా నటించిన ‘మాస్టర్’ సినిమా రిలీజ్‌ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని సేతుపతి అన్నాడు. ఇందులో అతను విలన్‌ పాత్ర పోషించాడు. కాగా, సేతుపతి వైదొలగడంతో అతని స్థానంలో కన్నడ నటుడు ధనంజయను విలన్‌గా సుకుమార్ ఫైనల్‌ చేసినట్టు సమాచారం.