దేశంలోని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఎంతో ముఖ్యమైన కార్డులలో రేషన్ కార్డ్ ఒకటనే సంగతి తెలిసిందే. అయితే వరుసగా మూడు నెలలు రేషన్ తీసుకోకపోతే మాత్రం రేషన్ కార్డు ఉన్నవారికి ఇబ్బందులు తప్పవనే చెప్పాలి. వరుసగా మూడు నెలలు రేషన్ తీసుకోని పక్షంలో రేషన్ కార్డ్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ నిబంధన ప్రస్తుతం అమలవుతున్నది తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు.
ఢిల్లీ ప్రభుత్వం ప్రస్తుతం ఈ నిబంధనను అమలు చేస్తోంది. ఇంటింటి సర్వే చేయడం ద్వారా రేషన్ కార్డు లబ్ధిదారులను గుర్తించడంతో పాటు వరుసగా మూడు నెలలు రేషన్ తీసుకోని పక్షంలో రేషన్ కార్డును తొలగించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లో సైతం ఈ తరహా నిబంధనలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. రేషన్ కార్డ్ ఉన్నవాళ్లు ప్రతి నెలా రేషన్ సరుకులను తీసుకోవడం సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
అయితే ఢిల్లీ ఫుడ్ మినిస్టర్ మాత్రం రేషన్ తీసుకోకుండా ఉండటానికి గల కారణాలను తెలుసుకొని మాత్రమే కార్డును రద్దు చేయాలా? వద్దా? అనే విషయంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రేషన్ కార్డ్ ఇన్ యాక్టివ్ లో ఉండి రేషన్ లబ్ధిదారులు ఢిల్లీలో లేకపోతే మాత్రం కార్డును రద్దు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఢిల్లీలో ఏకంగా 2,000 షాపులు 72 లక్షల రేషన్ కార్డులు ఉనారు.
ఇదే సమయంలో అర్హత ఉన్నవాళ్లకు కొత్త కార్డులు జారీ చేస్తామని ఫుడ్ మినిస్టర్ పేర్కొన్నారు. రేషన్ కార్డు ఉన్నవాళ్లు రేషన్ పొందడంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే సమీపంలోని అధికారులను సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
