ఇకపై ఆఫీస్ లో పంచ్ కొట్టక్కర్లేదు

కరోనా వైరస్ కారణంగా పెరుగుతున్న ముప్పును దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోంది . ఇకపై ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు అవసరం లేదు. ఈ విధంగా ఈ వ్యాధిని నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సతేంద్ర జైన్ తాజాగా లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రిని సందర్శించారు. కరోనా వైరస్ ముప్పును దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అలాగే ఆరోగ్య వ్యవహారాల […]

Written By: Neelambaram, Updated On : March 6, 2020 1:55 pm
Follow us on

కరోనా వైరస్ కారణంగా పెరుగుతున్న ముప్పును దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోంది . ఇకపై ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు అవసరం లేదు. ఈ విధంగా ఈ వ్యాధిని నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సతేంద్ర జైన్ తాజాగా లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రిని సందర్శించారు.

కరోనా వైరస్ ముప్పును దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అలాగే ఆరోగ్య వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు కరోనా నివారణకు సలహాలు అందించారు. కాగా అధికారిక వర్గాల సమాచారం ప్రకారం కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య ఇప్పటివరకు 30 కి చేరుకుంది. తాజాగా గురుగ్రామ్ నుండి కరోనా వైరస్ కేసు నమోదైంది. ఇక్కడ పే టీఏం కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ విషయంపై పేటీఎం సంస్థ యాజమాన్యం తెలియజేసింది. ఈ ఉద్యోగి ఇటీవలే ఇటలీ నుండి వచ్చాడు. ఢిల్లీ -ఎన్‌సిఆర్‌లో కొన్ని కరోనా కేసులు నమోదైనప్పటి నుండి ప్రజలలో భయాందోళనలు నెలకొన్నాయి . ఎయిమ్స్ తో పాటు సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ లో మాస్కులు, శానిటైజర్ల కొరత ఉందని తెలుస్తోంది.