Delhi election results 2025 : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం(ఫిబ్రవరి 8న) వెలువడనున్నాయి. ఈమేరకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. మధ్యాహ్నానికి తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కిపు శనివారం(ఫిబ్రవరి 8న) మొదలైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు లెక్కించారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. ఈ ఎన్నికల్లో ఫలితాలు కూడా అదేస్థాయిలో వస్తున్నాయి. ఉదయం పోస్టల్ బ్యాలెట్ లెక్కించారు. మొత్తం 70 స్థానాలకు గాను, బీజేపీ 12, ఆప్ 11 స్థానాల్లో ఆధిక్యం కనబర్చాయి.
ఆ ముగ్గురు వెనుకంజ..
ఇక పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతోపాటు ప్రస్తుత సీంఎ అతిషీ ముగ్గురూ వెనుకబడ్డారు. మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ ఇద్దరూ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు. జైల్లో ఉండి బెయిలుపై విడుదలయ్యారు. అతిషి ఆరు నెలల క్రితం బాధ్యతలు చేపట్టారు. ఆమె కూడా పాలనలో పెద్దగా ప్రజలను ఆకట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్‌లో ఈ ముగ్గురూ వెనుకబడ్డారు.