Delhi Car Blast 2025 Latest Update: ఢిల్లీ నగరంలో ఇటీవల ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్ దగ్గర కారులో బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పదిమంది దాకా చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ సాగిస్తున్నాయి. ఈ దర్యాప్తులో దిగ్భ్రాంతి కరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఢిల్లీలో పేలుడు చోటు చేసుకున్న తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు ఏకంగా 18 లక్షలు రికవరీ చేశారు. ఆల్ ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేస్తున్న షాహీన్ సయీద్ కు చెందిన రూ నెంబర్ 22లో 18 లక్షల డబ్బును అధికారులు గుర్తించారు.. దర్యాప్తుల భాగంగా అధికారులు షాహిన్ యూనివర్సిటీలోకి తీసుకెళ్లారు. ఆమె క్యాబిన్, వ్యక్తిగత గదిని మొత్తం తనిఖీ చేశారు. ప్లాస్టిక్ సంచిలో చుట్టి ఉన్న నగదును ఆమె గదిలో గుర్తించారు. దాదాపు 18 లక్షల నగదు అందుకే ఎలా వచ్చిందనే తీరుపై దర్యాప్తు సంస్థల అధికారులు విచారణ సాగిస్తున్నారు.
షాహిన్ జమాతే ఇస్లాం మహిళా విభాగంలో ఆమె 2023లో చేరింది. షాహిన్ కు 46 సంవత్సరాల వయసు ఉంటుంది. ఢిల్లీ పేలుడు ఘటనలో ఈమె కీలక నిందితురాలిగా ఉంది. షాహిన్ మొదట రెండు వివాహాలు చేసుకుంది. ఆ వివాహాలు విఫలమయ్యాయి. ఆ తర్వాత ఆల్ ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్ ముజమిల్ షకీల్ పరిచయమయ్యాడు. షాహిన్ కు ఇతడు జూనియర్. ఆ తర్వాత 2023లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. షకీల్ ద్వారానే ఆమె ఈ ఉగ్రవాద సంస్థలో చేరింది. షాహిన్, ముజమ్మిల్ తో పాటు మరో వ్యక్తి ఈ ఘటనలో అరెస్టయ్యారు.
షాహిన్ కు పాకిస్తాన్ నుంచి డబ్బు హవాలా రూపంలో వచ్చి ఉంటుందని దర్యాప్తు సంస్థల అధికారులు అనుమానిస్తున్నారు.. ఇంత డబ్బును వారు ఏం చేయాలనుకున్నారు? ఇంకా ఏమైనా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడాలని అనుకున్నారా? ఈ డబ్బు హవాలా రూపంలో వచ్చి ఉంటే.. వీరికి ఇక్కడ చేరవేసింది ఎవరు? అనే కోణాలలో దర్యాప్తు సంస్థల అధికారులు విచారణ సాగిస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.