Delhi Bomb Blast: రకరకాల విశ్లేషణలు… రకరకాల వార్తలు.. ఢిల్లీ బాబు పేలుళ్ల మీద వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితుల ఆధారంగా మీడియాలో వినిపిస్తున్నాయి.. పైగా ఢిల్లీ ఘటన జరిగిన తర్వాత.. ఘటన కంటే ముందు మన దేశ పోలీసులు.. ఇంటెలిజెన్స్ వర్గాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి.. సోదాలు జరుపుతున్నాయి.. వచ్చిన సమాచారం ఆధారంగా అత్యంత లోతుగా పరిశీలన చేస్తున్నాయి.. అలా వచ్చిన వివరాల ఆధారంగానే మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.
ఢిల్లీ బాంబు పేలుడు సంబంధించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నప్పటికీ.. ఒక స్టోరీ మాత్రం భయాందోళనకు గురిచేస్తోంది. ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ కు ఆత్మాహుతి దళం కారణం కాదని.. అది భయాందోళన వల్ల తొందరపాటు చేసిన దాడి అని తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్టు సమాచారం. “టెర్రర్ నెట్వర్క్ పై దాడుల నేపథ్యంలో.. కలిగిన ఒత్తిడి వల్ల ఇలా చేసి ఉండవచ్చు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి పూర్తిస్థాయి ఆత్మాహుతి పేలుడు విధానాన్ని అనుసరించలేదు. కావాలని అతడు దేనిని ఢీకొట్టలేదు. పూర్తిగా అభివృద్ధి చెందని బాంబును ఉపయోగించాడు. అందువల్లే ఈ దాడిలో తీవ్రత తగ్గింది.. లేకుంటే దాని పర్యవసానం వేరే విధంగా ఉండేదని” జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఉన్న మెట్రో రైల్వే స్టేషన్ పక్కన కారులో బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పదిమంది దాకా మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు.. చాలావరకు వాహనాలు ధ్వంసమయ్యాయి. మంటలు కూడా విపరీతంగా వ్యాపించాయి. ఆ మంటల వల్ల చుట్టుపక్కల ఉన్న జనాలు భయాందోళనకు గురయ్యారు.
ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలను ఆర్పి వేశాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని తనిఖీలు నిర్వహించారు. అనుమానస్పద వ్యక్తులను ప్రశ్నించి వదిలేశారు. ఆ తర్వాత సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో ఉన్న వివరాల ఆధారంగా ఈ కేసు కు సంబంధించి ఒక అంచనాకు వచ్చారు. హ్యుందాయ్ కారులో పెట్టిన బాంబు వల్ల ఈ ప్రమాదం జరిగిందని.. ఆ కారు ఎవరిదో కూడా పోలీసులు గుర్తించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. మరవైపు ఫరీదాబాద్ ప్రాంతంలో ఓ యూనివర్సిటీలో కొంతమంది వైద్యులు ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు వెంటనే ఆ వైద్యులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో భారీ టెర్రరిస్ట్ మాడ్యూల్ బయటపడింది. ఇంకా లోతుగా దర్యాప్తు చూస్తే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని పోలీసులు చెబుతున్నారు.