Delhi BJP President Virendra Sech Dev : ఢిల్లీలో కాలుష్యం ఏ స్థాయిలో పెరిగిందో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు. సాధారణంగానే ఢిల్లీలో వాహనాల ద్వారా వెలువడే కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. అలాంటిది శీతాకాలంలోనైతే చెప్పతీరుగా ఉండదు. ఢిల్లీకి పొరుగున హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు ఉంటాయి. ఈ రాష్ట్రాలలో శీతాకాలం సమయంలో రైతులు వరి వ్యర్ధాలను, గోధుమ పంట వ్యర్ధాలను తగలబెడుతుంటారు. ఫలితంగా ఆ పొగ ఢిల్లీ నగరాన్ని చుట్టుముడుతుంటుంది. ఆ సమయంలో ఢిల్లీ మొత్తం కాలుష్య కాసారంగా మారిపోతూ ఉంటుంది. గతంలో దీనిని నివారించడానికి ఆప్ ప్రభుత్వం సరి – బేసి విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే అది కూడా సత్ఫలితాన్ని ఇవ్వకపోవడంతో.. ఇటీవల కృత్రిమ వర్షం విధానాన్ని తెరపైకి తెచ్చింది. అయితే ఇంకా అది అమల్లోకి నోచుకోలేదు. ఇక హర్యానా, పంజాబ్ రైతులు పంట వ్యర్ధాలను తగలబెడుతుండడంతో ఢిల్లీ మొత్తం పొగ చూరింది. ఆస్తమా రోగులు, శ్వాస కోశ సంబంధిత వ్యాధులు ఉన్నవారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి.
ఆసుపత్రి పాలైన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు
ఢిల్లీలో అధికారాన్ని చేపట్టిన తర్వాత ఆప్.. గంగానది ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. అయితే అందులో అవకతవకలు జరిగాయని బిజెపి ఆరోపిస్తోంది. మరికొద్ది రోజుల్లో ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి. తినే పద్యంలో ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర సెచ్ దేవ్.. యమునా నది ప్రక్షాళనలో ఆప్ నేతలు పాల్పడిన అక్రమాలను ప్రజలకు వివరించేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆప్ ప్రభుత్వ తీరుకు నిరసనగా రెండు రోజుల క్రితం ఐటీవో ఘాట్ వద్ద యమునా నదిలో స్నానం చేశారు. దీంతో ఆయనకు ఊపిరి తీసుకోవడంలో సమస్యలు ఎదురయ్యాయి. చర్మ సంబంధిత అలర్జీలు సోకాయి. దీంతో ఆయన స్థానిక ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగా ఆయన ఆప్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు..” యమునా నది ప్రక్షాళన పేరుతో ఆప్ ప్రభుత్వం దోపిడికి పాల్పడింది. నదిని కాలుష్యం నుంచి ప్రక్షాళన చేయకపోగా.. అడ్డగోలుగా దోచుకుంది. ఫలితంగా ఆ నది ఇంకా కాలుష్య కాసారం లాగానే కనిపిస్తోంది. దానికి నిదర్శనమే నా అనారోగ్యం. రెండు రోజుల్లో నేను స్నానం చేస్తేనే ఇలా అయిందంటే.. ఆ నది చుట్టుపక్కల ఉన్న వారి పరిస్థితి ఏమిటని” ఆయన ప్రశ్నించారు. కాగా, వీరేంద్ర సచ్ దేవ్ ఎన్నికల స్టంట్ లు చేస్తున్నారని.. యమునా నదిని దశలవారీగా తమ ప్రక్షాళన చేస్తున్నామని ఆప్ నేతలు చెబుతున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Delhi bjp president virendra sechdev was hospitalized after being drowned in the yamuna river after challenging him
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com