Dehradun Incident: దేశంలో మైనారిటీలు హిందువులపై దాడిచేసినప్పుడు ఎవరూ పెద్దగా మాట్లాడరు. మైనారిటీలపై హిందువులు దాడిచేస్తే మాత్రం మైరారిటీలపై వివక్ష చూపుతున్నారని, ప్రభుత్వాలు మైనారిటీల హక్కుల రక్షణలో విఫలమయ్యాయని రోడ్డెక్కుతారు. కానీ ఓపికకు కూడా ఓ హద్దు ఉంటుంది. ఇంతకాలం మైనారిటీల దాడులను భరించిన హిందువుల్లో ఇప్డుపు మార్పు కనిపిస్తోంది. దెబ్బకు దెబ్బ.. తీయాలన్న చైతన్నం, తిరుగుబాటు కనిపిస్తోంది. డెహ్రాడూన్‌లో జరిగిన బీజేవైఎం నాయకుడి హత్య తర్వాత స్థానికులు చేసిన ప్రతీకార చర్యలు, బుల్డోజర్ చర్యలు, ఇంటర్నెట్ నిషేధం.. ఇవన్నీ ఒక్కటిగా చూస్తే హిందువుల్లో ఒక కొత్త రకమైన చైతన్యం వచ్చిందని కొందరు అంటున్నారు. కానీ ఇది నిజంగా తిరుగుబాటు సంకేతమా? లేదా చట్ట వ్యవస్థపై నమ్మకం కోల్పోవడం, ఆగ్రహం వల్ల జరిగిన మరో హింసా చక్రమా?
ఘటన నేపథ్యం…
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లా సహస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైరాగివాలా గ్రామంలో నీటి వివాదం హింసాత్మక ఘర్షణకు దారితీసింది. బీజేవైఎం (బీజేపీ యువ మోర్చా) నాయకుడు వినోద్ కుమార్ కశ్యప్ హత్యకు గురయ్యాడు. ఆయన కుటుంబ సభ్యులు కూడా గాయపడ్డారు. దీంతో స్థానికులు ఆగ్రహించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంతియాజ్ రజాఖ్ సంబంధిత ఇళ్లపై దాడి చేసి కొన్నింటిని తగులబెట్టారు. ప్రభుత్వం బుల్డోజర్లు పంపి చర్యలు తీసుకుంది. అల్లర్లు విస్తరించకుండా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.
హిందువుల్లో చైతన్యం..
స్థానిక అంశం మతపరమైన ఘటనగా మారింది. దీంతో హిందువులు ఇప్పుడు ‘‘దాడులు ఎదుర్కొనే స్థితి నుంచి దాడులు చేసే స్థాయికి’’ వచ్చారని కొందరు భావిస్తున్నారు. ఇది కొంతమందికి ‘‘చైతన్యం’’ లేదా ‘‘తిరుగుబాటు’’లా కనిపించవచ్చు. ఎందుకంటే గత కొన్నేళ్లలో కొన్ని ప్రాంతాల్లో హిందువులపై హింసాత్మక ఘటనలు పెరిగాయని, వాటికి తగిన ప్రతిస్పందన రావడం లేదని అనుకుంటున్నారు. అయితే నిజమైన చైతన్యం అంటే హింసను హింసతో సమాధానం చెప్పడం కాదు. అది చట్టబద్ధంగా, శాంతియుతంగా, సంఘటితంగా న్యాయం కోరడం.
వ్యవస్థలపై నమ్మకం లేక..
ఇది ‘‘తిరుగుబాటు’’ కాదు, చట్ట వ్యవస్థపై నమ్మకం కోల్పోవడానికి సంకేతం. ఉత్తరాఖండ్ ప్రభుత్వం(బీజేపీ) ఈ ఘటనపై స్పందించింది. బుల్డోజర్లు పంపి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులపై చర్యలు మొదలు పెట్టింది. ఇంటర్నెట్ నిలిపివేయడం కూడా అల్లర్లు వ్యాపించకుండా చేసే ప్రామాణిక చర్య. ఇది నేరస్థులను భయపెట్టే చర్య, న్యాయం వేగంగా జరిగింది. అయితే బుల్డోజర్ చర్యలు న్యాయస్థానాలను దాటి వెళ్లడం, ఒకే సముదాయాన్ని లక్ష్యంగా చేసుకోవడం వంటి ఆరోపణలు ఉన్నాయి.
హిందువుల్లో చైతన్యం వచ్చిందని చెప్పడం సులభం. కానీ నిజమైన చైతన్యం హింసను తిరస్కరించి, చట్టం, న్యాయం, శాంతిని బలపరచడంలో ఉంటుంది. డెహ్రాడూన్ ఘటన మనకు హెచ్చరిక: ఆగ్రహం సహజం, కానీ దాన్ని సరైన మార్గంలో మళ్లించకపోతే మరిన్ని బాధలు వస్తాయి. న్యాయం అందరికీ ఒకేలా ఉండాలి. హింస ఎవరికీ పరిష్కారం కాదు. శాంతి, న్యాయం, సామరస్యం ఇవే నిజమైన బలం.
