దీప్‌ సిద్ధూ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌..: అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడా..?

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు గణతంత్ర దినోత్సవం రోజున రైతులు మరింత కోపోద్రిక్తులయ్యారు. ఏకంగా ఢిల్లీలోని ఎర్రకోటను ముట్టడించారు. అయితే.. ఈ ముట్టడి వెనుక దాగి ఉన్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. Also Read: హింస ఎఫెక్ట్: చీలిపోయిన రైతు సంఘాలు ఎర్ర కోట మీద జాతీయ జెండాతో పాటు మరో జెండా ఎగరవేసిన పంజాబీ సింగర్ దీప్ సిద్దు అజ్ఞాతంలోకి […]

Written By: Srinivas, Updated On : January 28, 2021 3:10 pm
Follow us on


వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు గణతంత్ర దినోత్సవం రోజున రైతులు మరింత కోపోద్రిక్తులయ్యారు. ఏకంగా ఢిల్లీలోని ఎర్రకోటను ముట్టడించారు. అయితే.. ఈ ముట్టడి వెనుక దాగి ఉన్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

Also Read: హింస ఎఫెక్ట్: చీలిపోయిన రైతు సంఘాలు

ఎర్ర కోట మీద జాతీయ జెండాతో పాటు మరో జెండా ఎగరవేసిన పంజాబీ సింగర్ దీప్ సిద్దు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. గణతంత్ర దినోత్సవం నాడు అర్ధరాత్రి నుంచి దీప్ సిద్దు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఆయన ఫోన్ లొకేషన్ ట్రేస్ చేయగా చివరి లొకేషన్ హర్యానాగా చూపిస్తోంది. ఎర్ర కోట ముట్టడి కేసులో దీప్ సిద్దు మీద పెద్ద ఎత్తున అభియోగాలు మోపారు. రైతులను దీప్ సిద్ధూ రెచ్చగొట్టారని ఆరోపణలు ఉన్నాయి.

Also Read: మరో రూట్‌లో వెళ్లిన కేంద్రం..: రైతు ఉద్యమంపై ఉక్కుపాదం తప్పదా..?

గ్యాంగ్‌స్టర్‌‌ లఖా సుధాన పైన కూడా కేసు నమోదైంది. ఇక రైతు సంఘం నేత దర్శన్ పాల్ కూడా పోలీసులు నోటీసులు అందజేశారు. ‘మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో’ చెప్పాలంటూ నోటీసులో పోలీసులు ప్రశ్నించారు. ఈ అంశాల మీద మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని పోలీసులు ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 22 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. అయితే ఈ ఎర్రకోట ఘటనను దీప్ సిద్ధూ సమర్థించుకున్నాడు. ఈ కోట ముట్టడిలో తప్పేమీ లేదని ఆయన గతంలో వ్యాఖ్యానించాడు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్