https://oktelugu.com/

తెలంగాణలో 19వేల పోస్టుల భర్తీకి నిర్ణయం..

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వంత తీపి కబురు అందించింది. పోలీస్ శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. దీంతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతలో హార్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో ఈ పోస్టుల భర్తీ ఎలా చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. పోలీస్ శాఖలో దాదాపు 19 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖకు […]

Written By:
  • NARESH
  • , Updated On : July 4, 2021 / 09:06 AM IST
    Follow us on

    ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వంత తీపి కబురు అందించింది. పోలీస్ శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. దీంతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతలో హార్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో ఈ పోస్టుల భర్తీ ఎలా చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

    పోలీస్ శాఖలో దాదాపు 19 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖకు డీజీసీ ఖాళీల భర్తీ వివరాలను తెలియజేస్తూ ఓ నివేదికను అందించారు. ఆర్థిక శాఖ నుంచి ఆమోదం పొందగానే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. పోలీస్ శాఖలో సీవిల్ సీఎస్ విభాగంలో 360, ఏఆర్ ఎస్ ఐ 29, కమ్యూనికేషన్స్ 20 ఖాళీలున్నాయి. సివిల్ విభాగంలో 7,700, ఏఆర్ 6680, టీఎస్ఎస్పీలో 3850, 15వ బెటాలియన్లో 560, కమ్యూనికేషన్ విభాగంలో 250 ఖాళీలున్నాయి. మొత్తంగా 19,449 ఖాళీలున్నట్లు గుర్తించారు.

    ఇక కరోనా కాలంలో ఈ ఉద్యోగాల భర్తీ సాధ్యమా..? అన్న చర్చ సాగుతోంది. గత నోటిఫికేషన్ల విషయంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఈసారి అలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఆన్ లైన్ విధానాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో పడ్డారు. ఇందుకోసం ప్రత్యేక యాప్ ను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకుట్లయితే ఈనెలలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.

    ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఆశతో ఉన్న నిరుద్యోగులకు ప్రభుత్వ నిర్ణయం వరంగా మారింది. జోన్ల విధానంపై కూడా కేంద్రం ఆమోదం తెలపడంతో స్థానికులకే ఉద్యోగాలు లభించే అవకాశాలు ఎక్కువే ఉన్నాయంటున్నారు. అయితే పోలీస్ శాఖ భర్తీ తరువాత రెవెన్యూ, ఇతర శాఖల భర్తీపై కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.