
చైనా నుంచి వచ్చిన ఈ కరోనా మహమ్మారి దేశంలో మరణ మృదంగం వినిపిస్తోంది. ముఖ్యంగా ఫిట్ నెస్ లేని వారిపై, దీర్ఘకాలిక రోగులపై తమ ప్రతాపం చూపిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో రాత్రిళ్లు పనిచేసే సరిగ్గా ఇమ్యూనిటీ ఉండని జర్నలిస్టులను ఎందరినో బలితీసుకుంది. డెస్కుల్లో వేళాపాళా లేని టైమింగ్ లతో సరిగ్గా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టని జర్నలిస్టులు కరోనా బారిన పడి చనిపోతూనే ఉన్నాడు.
తాజాగా కరోనాకు మరో సీనియర్ జర్నలిస్ట్ బలి అయ్యారు. ఇప్పటికే కరోనాతో హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో చనిపోయారు. ఈ ఉదయం సీనియర్ జర్నలిస్ట్ గోపీ చనిపోయారన్న వార్త జర్నలిస్టు సర్కిల్స్ లో తీరని విషాదాన్ని నింపింది.
జర్నలిస్టు గోపీ సాక్షిలో పనిచేస్తున్నారు. బిత్తిరి సత్తి ప్రధాన పాత్రధారిగా ‘గరం గరం వార్తలు’ చేస్తున్నారు. ఈ పాపులర్ షోను లీడ్ చేసేది గోపీనే. ఈ షోతోనే బాగా గుర్తింపు పొందాడు.
సీనియర్ జర్నలిస్ట్ గోపీని కరోనా బలితీసుకోవడం తోటి జర్నలిస్టులను కంటతడి పెట్టించింది. గోపిది స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లె. కరోనా బారిన పడిన ఆయన వారం రోజులుగా మదనపల్లెలో చికిత్స తీసుకుంటున్నాడు. కరోనాపై పోరాటంలో గోపీ అసువులు బాసాడు.