Dating One Night Stand: ప్రపంచం దినదినాభివృద్ధి చెందిన కొద్దీ మనుషుల్లో అలవాట్లు కూడా మారిపోతున్నాయి. అయితే కొన్ని అలవాట్లు వారి వ్యక్తిగతంగా సంతోషాన్నిచ్చినా సమాజం పరంగా చూస్తే అవి కీడు తెచ్చేవే. ముఖ్యంగా సాంప్రదాయాల విషయంలో భారత్ ముందుంటుంది. కానీ పాశ్చాత్య కల్చర్ పేరిటి ఇప్పుడు అంతా మారిపోతుంది. సాంప్రదాయాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. స్వేచ్ఛాయుత భారతంలో కొంచెం అనుకూల టైం దొరికితే చాలు యువత దూసుకుపోతుంది. తల్లదండ్రులు చెప్పిన మాటలను పట్టించుకోకుండా తమకిష్టం వచ్చినట్లు ఉంటున్నారు. సంబంధాలు, బంధాల విషయంలో పెద్దలు ఎన్ని చెప్పినా కొందరు పట్టించుకోవడం లేదు. ఇంకొందరు మాత్రం వాటినే అనుసరిస్తున్నారు.

అబ్బాయిలు, అమ్మాయిలు టీనేజ్ వయసు రాగానే స్వతంత్రంగా ఉండాలని అనుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా వారికి స్వతంత్రాన్ని ఇస్తే ప్రపంచాన్ని తెలుసుకుంటారని భావిస్తున్నారు. కానీ కొందరు తప్పుదారి పడుతున్నారు. లైంగిక సంబంధాల్లో ఇప్పడు కల్చర్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సాంప్రదాయంగా పెళ్లి చేసుకొని ఆ తరువాత తమ భాగస్వామితో జీవితాంతం ఎంజాయ్ చేసేవారు. కానీ ఇప్పుడు తాత్కాలిక సుఖం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. డేటింగ్, వన్ నైట్ స్టాండ్ పేరిట కొత్త కార్యక్రమాలు పెడుతూ సాంప్రదాయ విలువలను తొక్కేస్తున్నారు.
ఇటీవల డేటింగ్, వన్ నైట్ స్టాండ్ అనే కల్చర్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఒకప్పుడు ఎవరైనా సరే పెళ్లి చేసుకున్న తరువాత తమ భాగస్వామితో లైంగిక సుఖం పొందేవారు. జీవితాంతం ఇద్దరు కలిసి మెలిసి ఉండేవారు. కానీ ఇప్పుడు కొందరు పెళ్లి చేసుకునేవరకు ఆగలేకపోతున్నారు. దీంతో తాత్కాలిక సుఖం కోసం వెంపర్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో డేటింగ్ పేరిట అమ్మాయి, అబ్బాయి ఒక్కటవుతున్నారు. పెళ్లికి ముందు ఇద్దరు అభిరుచులు తెలుసుకోవడానికే డేటింగ్ అని చెబుతున్నా.. ఒకరినొకరు తెలుసుకోవడం అటుంగి… అ తరువాత చేసే పనులన్నీ చేస్తున్నారు. దీంతో అబ్బాయిల సంగతేమో గానీ.. అమ్మాయిలైతే తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక కొత్తగా వన్ నైట్ స్టాండ్ అని కొత్త కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే కొందరు డేటింగ్, వన్ నైట్ స్టాండ్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. వీటికి తేడా ఏంటో చూద్దాం.
Also Read: Tollywood Actors : కోట్ల రూపాయలు ఇచ్చి భార్యలను వదులుకున్న హీరోలు ఎవరో తెలుసా..?
పెళ్లికి ముందు ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి తిరుగుతూ, వారి అభిరుచులు తెలుసుకుంటారు. దీనినే డేటింగ్ అంటారు. ఇలా చేయడం వల్ల ఇద్దరి మనస్తత్వాలు తెలిసిపోతాయన్నమాట. అయితే ఆ తరువాత ఇద్దరి మనస్తత్వాలు నచ్చకపోతే విడిపోతారు. అయితే ఇలా చేయడం వల్ల కొందరు బెటరని ఫీలవుతారు. కాని ఆ తరువాత జరిగే నష్టంకూడా జరగొచ్చిని కొందరు అంటున్నారు. ఎందుకంటే డేటింగ్ పేరుతలో కేవలం మనస్తత్వాలు తెలుసుకోవడమే కాదు. అంతకుమించి చేస్తున్నారు. కొందరు ఒకడుగు ముందుకేసి లైంగికంగా కూడా కలుస్తున్నారు. ఇవన్నీ చేసిన తరువాత విడిపోతే ఆ తరువాత వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్న తరువాత అమ్మాయిలకే ఎక్కువగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక లేటేస్టుగా కొత్త కొత్త కార్యక్రమం చాపకింద నీరులా విస్తరిస్తోంది. ‘వన్ నైట్ స్టాండ్’ పేరుతో కొందరు డైరెక్టు లైంగికంగా కలుస్తున్నారు. డేటింగ్ అంటే ఓ వ్యక్తితో ఎక్కువ రోజులు గడిచి ఆ తరువాత విడిపోవడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే కొందరు ఒంటరిగా ఉన్న వారు ఒకరాత్రి ఎంజాయ్ చేయడానికి వన్ నైట్ స్టాండ్ బాట పడుతున్నారు. ఆన్లైన్లో ఎక్కువగా ఇది సాగుతుండడంతో కొందరు దీనిని అనుసరిస్తున్నారు. కొన్ని కంపెనీలు సీక్రెట్ గా అబ్బాయిలకు మెసేజ్లు పంపి వారికి కావాల్సిన ఆనందాన్నిస్తున్నారు.
అయితే ఈ రెండింట్లో ఏదీ బెటరని ఆలోచించే బదులు సాంప్రదాయంగా పెళ్లి చేసుకున్న తరువాత లైంగికంగా కలవడం బెటరని అంటున్నారు. అయితే చాలా మంది సాంప్రదాయాలకు విరుద్దమైన పోకడలను అనుసరిస్తున్నారు. కానీ అది మంచిది కాదని సూచిస్తున్నారు.
Also Read: TV actress: పెళ్లికి ముందే తనపై అత్యాచారం.. బుల్లితెర నటి వెండితెర నటుడిపై ఫిర్యాదు