Dark Net: డార్క్‌ నెట్‌ అంటే ఏంటి ? NEET గొడవకి, దీనికి సంబంధం ఏంటి?

డార్క్‌ నెట్‌ను డార్క్‌ వెబ్‌ అని కూడా పిలుస్తారు. ఇది రహస్య వెబ్‌సైట్‌ల కేంద్రం. దీనిని ఎన్‌క్రిప్టెడ్‌ ఛానెల్‌ల ద్వారా మాత్రమే యాక్సెస్‌ చేస్తారు.

Written By: Raj Shekar, Updated On : June 27, 2024 12:11 pm

Dark Net

Follow us on

Dark Net: జూన్‌ 18న యూజీసీ నిర్వహించిన నెట్‌ పరీక్ష పత్రం ఆదివారం(జూన్‌ 16న) లీక్‌ చేసినట్లు సీబీఐ గుర్తించింది. ఆ తర్వాత దానిని ఎన్‌క్రిప్టెడ్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం డార్క్‌నెట్‌లో అమ్మకానికి ఉంచారని పేర్కొంది. ప్రాథమిక దర్యాప్తులో ఈ విషయాలను గుర్తించింది. నెట్‌లో అక్రమాలు జరిగాయని కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో పనిచేసే భారతీయ సైబర్‌ నేర విచారణ సమన్వయ కేంద్రానికి చెందిన జాతీయ సైబర్‌ నేర హెచ్చరికల విశ్లేషణ విభాగం కూడా యూజీసీకి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగానే యూజీసీ నెట్‌ పరీక్షను రద్దు చేసింది. అయితే ఇప్పుడు ఈ ఎన్‌క్రిప్టెడ్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. డార్క్‌నెట్‌ అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుంది అనే వివరాలు తెలుసుకుందాం..

డార్క్‌ నెట్‌ అంటే..
డార్క్‌ నెట్‌ను డార్క్‌ వెబ్‌ అని కూడా పిలుస్తారు. ఇది రహస్య వెబ్‌సైట్‌ల కేంద్రం. దీనిని ఎన్‌క్రిప్టెడ్‌ ఛానెల్‌ల ద్వారా మాత్రమే యాక్సెస్‌ చేస్తారు. ప్రత్యేకమైన వెబ్‌ బ్రౌజర్‌ ద్వారా మాత్రమే యాక్సెస్‌ చేసే ఇంటర్నెట్‌ సైట్‌ల సముదాయం. ఇంటర్నెట్‌ కార్యకలాపాలను రహస్యంగా ఉంచడానికి దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు.

ఎలా పనిచేస్తుందంటే..
డార్క్‌ వెబ్‌ ఆనియన్‌ రూటర్‌ ద్వారా రహస్యంగా పనిచేస్తుంది. రహస్య కమ్యూనికేషన్‌ను ప్రారంభించడానికి ఉచిత, ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌. దొంగిలించడానికి ఉపయోగిస్తారు. డార్క్‌నెట్‌ దాని ఎండ్‌–టు–ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ కారణంగా అందరూ చూడలేరని నిపుణులు అంటున్నారు. డార్క్‌నెట్‌ టోర్, ఫ్రీనెట్, ఐ2పి, టెయిల్స్‌ వంటి ప్రత్యేక బ్రౌజర్ల ద్వారా మాత్రమే యాక్సెస్‌ చేయవచ్చు. టోర్‌ వంటి గోప్యత–కేంద్రీకృత బ్రౌజర్‌ ప్రాక్సీ సర్వర్ల ద్వారా వెబ్‌పేజీ అభ్యర్థనలను రూట్‌ చేస్తుంది. దీంతో బ్రౌస్‌ చేసినవారి ఐపీ అడ్రస్‌లను కూడా గుర్తించలేం.

డార్క్‌ నెట్‌ ఉపయోగాలు..
డార్క్‌నెట్‌ నిషేధిత వస్తువుల అమ్మకం, కొనుగోలు కోసం ఉద్దేశించిన ఒక రహస్య వేదికగా మారింది. డ్రగ్స్, ఆయుధాలు, అశ్లీల కంటెంట్, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలు. అనామక కవర్‌ను అందించగల సామర్థ్యం కారణంగా, ప్లాట్‌ఫారమ్‌ ప్రతీ రకమైన చట్టవిరుద్ధ కార్యకలాపాలలో వ్యవహరించే నేరస్థులకు సురక్షితమైన స్వర్గధామంగా మారింది. బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టోకరెన్సీల పరిణామంతో విషయం సంక్లిష్టంగా మారుతుంది. ఇది పూర్తిగా చట్టపరమైన కారణాల కోసం గోప్యత అవసరమయ్యే వ్యక్తులచే కూడా ఉపయోగించబడుతుంది.

ఇది చట్టబద్ధమైనదేనా?
భారతదేశంతో సహా అనేక దేశాలలో డార్క్‌నెట్‌ బ్రౌజర్లు చట్టవిరుద్ధం కానప్పటికీ, వాటి ఉపయోగం తరచుగా కార్యకలాపాలను దాచిపెట్టే ఉద్దేశాన్ని సూచిస్తుంది. బ్లాక్‌ చేయబడిన సోషల్‌ మీడియా లేదా డార్క్‌నెట్‌లో నిషేధించబడిన వెబ్‌సైట్‌లను యాక్సెస్‌ చేయడం వలన ప్రభుత్వ అధికారుల నుంచి చట్టపరమైన పరిణామాలకు దారితీయవచ్చు.

నీట్‌ పేపర్‌ లీక్‌కు సంబంధం?
నెట్‌ పేపర్‌ పరీక్షకు మూడు రోజుల ముందే డార్క్‌ నెట్‌లో లీక్‌ అయినట్లు గుర్తించిన నేపథ్యంలో ఇప్పుడు నీట్‌ పరీక్షలో అవకతవకలకు కూడా డార్క్‌ నెట్‌కు సంబంధం ఉండి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవైపు నీట్‌ అవకతవకలపై దుమారం కొనసాగుతున్న సమయంలోనే నెట్‌ పేపర్‌ లీక్‌కు సంబంధించి షాకింగ్‌ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో కేంద్రం నెట్‌ పేపర్‌ లీక్‌పై దర్యాప్తు చేస్తున్నట్లుగా నీట్‌ అవకతవకలపై దర్యాప్తు చేయించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.