Delhi Weather : భారత రాజధాని వాసులను కాలుష్యం కష్టాలు వీడడం లేదు. ఏటేటా పొగ మంచుతో గాలి కలుషితమవుతోంది. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రతీ ఏటా శీతాకాలంలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం మూడేళ్లుగా ఈవెన్, ఆడ్ నంబర్స్ ప్రకారం వాహనాలను నడుపుతోంది. దీంతో కొంత వరకు కాలుష్యం తగ్గుతున్నా.. సమస్యకు శాశ్వత పరిష్కారం మాత్రం దొరకడం లేదు. సుప్రీ కోర్టు జోక్యం చేసుకున్నా పాలకులు చర్యలు తీసుకుంటున్నా.. కాలుష్యాన్ని నియంత్రించలేకపోతున్నారు. ఢిల్లీ కాలుష్యానికి ప్రధాన కారణం పొరుగున ఉన్న హర్యాణా, పంజాబ్ రాష్ట్రాల్లో రైతులు పంట వ్యర్థాలను కాల్చడమే అని గుర్తించారు. కానీ, నియంత్రించడంలో అక్కడి పాలకులు విఫలమవుతున్నారు. పంట వ్యర్థాలను కాల్చడంతో భూసారం తగ్గుతోంది. మరోవైపు కాలుష్యం పెరుగుతోంది. అయినా రైతుల్లో కూడా మార్పు రావడం లేదు. అఊఅఖ–ఇండియా డేటా ప్రకారం, రాజధాని ప్రాంతంలోని అనేక ప్రాంతాలు 300 కంటే ఎక్కువ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదు అయింది. దీపావళికి ముందే గాలి నాణ్యత పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సీజన్‌లో తొలిసారిగా రాజధానిలో ఎయిర్ క్వాలిటీ 307కి పడిపోయినందున సోమవారం ఉదయం ఢిల్లీలోని పలు ప్రాంతాలను దట్టమైన పొగమంచు చుట్టుముట్టింది. ఇక కనిష్ట ఉష్ణోగ్రత 20.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఈ సీజన్ కన్నా రెండుపాయింట్లు ఎక్కువగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 35.8 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతాయని అంచనా.
ఎయిర్ క్వాలిటీ ఇలా…
ఇక ఎయిర్ క్వాలిటీ విషయాన్కి వస్తే.. సున్నా నుంచి 50 మధ్య ఉంటే చాలా మంచి వాతావరణంగా పరిగణిస్తారు. 51 నుంచి 100 వరకు సంతృప్తికరమైనదిగానే అంచనా వేస్తారు. 101 నుంచి 200 వరకు మధ్యస్థ వాతావరణంగా పరిగణిస్తారు. 201 నుంచి 300 వరకు పూర్ క్వాలిటీగా పరిగణిస్తారు. 301 నుంచి 400 వరకు చాలా ప్రమాదకరమైనదిగా భావిస్తారు. 401 నుంచి 500 వరకు అత్యంత ప్రమాదకరమైన గాలిగా పరిగణిస్తారు. దీపావళికి ముందే ఢిలీలలో ఈసారి గాలి నాణ్యత బాగా పడిపోయింది. దీంతో డిసెంబర్ వరకూ నగరంలో టపాసులు కాల్చడాన్ని ప్రభుత్వం నిషేధించింది.
ఆదివారం విపరీతంగా కాల్చివేత..
ఇదిలా ఉంటే.. పంజాబ్, హర్యానాలో రైతులు ఆదివారం విపరీతంగా పంట వ్యర్థాలను కాల్చివేశారు. దీంతో ఆ పొగ మొత్తం ఢిల్లీని తాకింది. దీంతో ఆదివారం కాలుష్యం కాస్త మెరుగ్గా ఉండగా, సోమవారం మరింత క్షిణించింది. మంగళవారం నాటికి గాలి నాణ్యత పీఎం 2.5 నుంచి 7 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా పీఎం 2.5 మైక్రో మీటర్లు లేదా అంతకన్నా తక్కువ ఉండాలి. కానీ, ఢిల్లీలో ఇది 10 వరకు నమోదవుతుంది.
కాలుష్య నియంత్రణ చర్యల పరిశీలన..
ఇదిలా ఉంటే ఢిల్లీ సీఎం అతిషి ఆనంద్ విహార్ బస్‌డిపోలో కాలుష్య నియంత్రణ చర్యలను పరిశీలించారు. ఆనంద్ విహార్ ప్రాంతంలో కాలుష్యానికి అతిపెద్ద కారణాలలో ఇతర రాష్ట్రాల నుంచి∙బస్సులు రావడం ఒకటని, జాతీయ సమీపంలోని తమ బస్ డిపోలో కాలుష్య నిరోధక చర్యలను అమలు చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో నిమగ్నమై ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు.
#WATCH | Delhi: A layer of fog engulfs Akshardham temple and surrounding areas as the AQI slips to ‘very poor’ category with AQI at 307, as per SAFAR-India pic.twitter.com/h4Px0uNdIS
— ANI (@ANI) October 21, 2024
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Danger bell for delhi air quality has fallen to dangerous level
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com