YCP Leader Murdered: వైసీపీలో వర్గపోరు..దళిత నేత దారుణ హత్య

YCP Leader Murdered : వైసీపీలో వర్గ పోరుకు మనుషుల ప్రాణాలను బలిగొంటున్నారు. నేతల మధ్య విభేదాలకు కిందిస్థాయి నేతలు, కార్యకర్తలు మూల్యం చెల్లించుకుంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో గంజి నాగప్రసాద్ హ్యత ఘటన మరువక ముందే ముదినేపల్లికి చెందిన మాల మహానాడు నేత, వైసీపీ గ్రామ నేత వర్రె నాగేంద్ర(39)ను ప్రత్యర్థులు కత్తులతో పొడిచి చంపారు. అడ్డొచ్చిన సమీప బంధువు అరుగుల మహేశ్‌(29)పైనా దాడి చేశారు. ఈ ఘటనలో వర్రె నాగేంద్ర అక్కడికక్కడే మృతి చెందగా… మహేశ్‌ […]

Written By: Dharma, Updated On : May 15, 2022 10:35 am
Follow us on

YCP Leader Murdered : వైసీపీలో వర్గ పోరుకు మనుషుల ప్రాణాలను బలిగొంటున్నారు. నేతల మధ్య విభేదాలకు కిందిస్థాయి నేతలు, కార్యకర్తలు మూల్యం చెల్లించుకుంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో గంజి నాగప్రసాద్ హ్యత ఘటన మరువక ముందే ముదినేపల్లికి చెందిన మాల మహానాడు నేత, వైసీపీ గ్రామ నేత వర్రె నాగేంద్ర(39)ను ప్రత్యర్థులు కత్తులతో పొడిచి చంపారు. అడ్డొచ్చిన సమీప బంధువు అరుగుల మహేశ్‌(29)పైనా దాడి చేశారు. ఈ ఘటనలో వర్రె నాగేంద్ర అక్కడికక్కడే మృతి చెందగా… మహేశ్‌ విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్సపొందుతున్నాడు. నాగేంద్రను అధికార పార్టీ నాయకులే పొట్టన పెట్టుకున్నారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణతో వర్రె నాగేంద్రకు కొన్నాళ్లుగా విభేదాలున్నాయని.. ప్రశ్నించడాన్ని సహించలేకే ఈ దారుణానికి ఒడిగట్టారని తెలుస్తోంది.

Varre Nagendra

హత్య జరిగిందిలా..
ముదినేపల్లి మసీదు సెంటర్‌లో నివసిస్తున్న షేక్‌ ఇర్ఫాన్‌(32) శుక్రవారం రాత్రి తన ఆటోను నిలిపేసి వెళ్తుండగా.. నరేంద్ర తల్లి మరియ మ్మ అడ్డుకుంది. తన ఇంటి ముందు, రోడ్డు మధ్యలో ఆటో పార్క్‌ చేయవద్దని ఎన్నిసార్లు చెబుతున్నా ఎందుకు వినడంలేదని నిలదీసింది. ఇర్ఫాన్‌ కోపంతో ఊగిపోతూ ఆమె ను దుర్భాషలాడాడు. పెయ్యేరు పంచాయతీ పరిధిలోని వైఎస్సార్‌ కాలనీలో ఉండే భార్య తరఫు బంధువులకు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే… దూబే శ్రీకాంత్‌, చంద్రకాంత్‌తోపాటు 10 మందితో ఇర్ఫాన్‌ ఆటోలో మరియమ్మ ఇంటికి వచ్చారు. ఆటో పార్కింగ్‌పై తలెత్తిన వివాదాన్ని పక్కన పెట్టి… ‘నీ కొడుకు ఎక్కడ?’ అంటూ కేక లు వేయడం మొదలుపెట్టారు. ఈ కేకలు విని తల్లి ఇంటికి సమీపంలోనే మరో ఇంట్లో నివాసం ఉంటున్న నాగేంద్ర అక్కడికి వచ్చారు. నాగేంద్రను చూడగానే కత్తులతో దాడి చేశారు.

Also Read: AP High Court: కోర్టు ధిక్కరణ కేసులో మరో ఐఏఎస్ కు జైలు

YCP Leader Murdered

నాగేంద్రను ఇర్ఫాన్‌ పట్టుకోగా.. మరొక వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. అడ్డొచ్చిన మహేశ్‌పైనా కత్తులతో దాడి చేశారు. ఆ తర్వాత తాము వచ్చిన ఆటోలోనే అక్కడి నుంచి పారిపోయారు. నాగేంద్ర హత్యకు ఉపయోగించిన ‘కొక్కెం కత్తులు’ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.హత్యకు పాల్పడిన యువకులు అదే రోజు పెళ్లి వేడుక లో రోజంతా పూటుగా మద్యం సేవించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అధికార పార్టీకి చెందిన నేత ఆధ్వర్యంలో మం డల స్థాయి ప్రజా ప్రతినిధిని రహస్యంగా కలిశారని, అక్క డ అందిన సూచనల మేరకే నాగేంద్రను హత్య చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తానూ వైసీపీలోనే ఉన్నప్పటికీ… స్థానిక నాయకులతో నాగేంద్రకు విభేదాలున్నాయి. ఇటీవల వంగవీటి రంగా విగ్రహావిష్కరణ సందర్భంగా నాగేంద్ర అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీపీలకు వ్యతిరేకంగా మాట్లాడారు. దీంతో పోలీసులు ఆయనను స్టేషన్‌కు తరలించారు. దీనికి నిరసనగా వైసీపీ అసమ్మతి వర్గానికి చెందిన మహిళలు రాస్తారోకో చేశారు.

టెన్షన్.. టెన్షన్..
నాగేంద్ర మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం శనివారం సాయంత్రం 5 గంటలకు ముదినేపల్లి తీసుకువచ్చారు. అదే వ్యానులో వచ్చిన నాగేంద్ర భార్య జ్యోతి తన భర్త మృతదేహాన్ని వ్యాను నుంచి కిందికి దింపేందుకు అంగీకరించకుండా అడ్డంగా నిలబడ్డారు. తన భర్తను చంపిన వ్యక్తులను తన ఎదుట నిలబెట్టాలని, వారి శవాలను చూశాకే మృతదేహాన్ని వ్యాను నుంచి దింపాలని డిమాండ్‌ చేస్తూ బోరు బోరున విలపించారు. సుమారు రెండు గంటలపాటు మృతదేహాన్ని వ్యాను నుంచి కిందికి దించనివ్వలేదు. పెద్ద సంఖ్యలో దళితులు, మైనార్టీలు వ్యానును చుట్టూముట్టారు. నిందితులపై హత్య కేసు నమోదు చేశామని, ఎవరినీ వదిలి పెట్టేది లేదని పోలీసులు హామీ ఇవ్వటంతోపాటు… కొందరు బంధువులు సర్దిచెప్పడంతో వారు శాంతించారు.

Also Read:KCR vs BJP: కేసీఆర్ ను అధికారంలోంచి దించడం బీజేపీకి సాధ్యమేనా?

Tags