Asani Cyclone: ఆంద్రప్రదేశ్ కు మరో తుపాను గండం పొంచి ఉంది. దక్షిణ అంమాన్ సముద్రం మీదుగా ఏర్పడిన అల్పపీడనం తుపాను గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఏపీపై పెను ప్రభావం పడనుందని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర పేర్కొన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారి తూర్పు-మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారుతుందని చెబుతున్నారు.

ఆదివారం నాటికి అల్పపీడనం మరింత బలపడి తుఫానుగా మారే వీలుంది. దీంతో మే 10, 13 తేదీల్లో మధ్య పశ్చిమ బెంగాల్ లో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. ఈ తుఫానుకు ఆసని అని పేరు పెట్టారు. ఈ పేరు పెట్టింది శ్రీలంక అని తెలుస్తోంది. ఆసని అంటే కోపం అని వారి భాషలో పిలుస్తారట. అందుకే దానికి ఈ పేరు పెట్టినట్లు సమాచారం.
Also Read: TRS-BJP: టీఆర్ఎస్-బీజేపీ పొత్తు గుట్టు రట్టు
కోల్ కతతోపాటు గంగా బెంగాల్ లో మే 10,13 తేదీల్లో వర్షాలు పడతాయి. మే 10 నుంచి కోల్ కతలో పిడుగులు పడే ప్రమాదముంది. ప్రస్తుతం దక్షిణ అండమాన్ సముద్రంతో పాటు బంగాళాఖాతంలో కూడా అల్పపీడనం ఏర్పడుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తన్నారు. మే 10 నుంచి ఒడిశా మీదుగా ఉత్తర ఆంధ్రప్రదేశ్ లో గంటకు 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది.

దక్షిణ అండమాన్ సముద్రం ఆనుకుని బంగాళాఖాతలో అల్పపీడనం ఏర్పడనుంది. మే 10 వరకు వాయువ్య దిశలో కదులుతుంది. ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరంలో వాయువ్య బంగాళాఖాతం వైపు కదిలే సూచనలున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదముంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Also Read: Rajya Sabha Seats: రాజ్యసభ స్థానాలకు పార్టీ పల్లకి మోసేవారు వద్దు.. పారిశ్రామికవేత్తలే ముద్దు
Recommended Videos: