https://oktelugu.com/

Current cuts: కరెంట్ కోతలైనా.. మరేదైనా.. వైసీపీది ఒకటే దారి..!

AP Current cuts: వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి దూకుడు మంత్రాన్నే జపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలోనే ‘ప్రజావేదిక’ను కూల్చివేసి తమ ప్రభుత్వం ఏం చేయబోతుందోనని ముందుగానే ప్రజలందరికీ క్లారిటీ ఇచ్చారు. నాటి నుంచి నేటి వరకు కూడా వైసీపీ ప్రతిపక్షాలపై ఎదురుదాడితోనే కాలం వెళ్లదీస్తూ ముందుకు కదులు తప్పా.. సమస్య పరిష్కారానికి చొరవ చూపకపోవడం శోచనీయంగా మారుతోంది. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే చాలు వారందరినీ ప్రభుత్వం పోలీసులతో గృహ నిర్భంధాలు చేయడం, […]

Written By: NARESH, Updated On : April 10, 2022 11:18 am
Follow us on

AP Current cuts: వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి దూకుడు మంత్రాన్నే జపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలోనే ‘ప్రజావేదిక’ను కూల్చివేసి తమ ప్రభుత్వం ఏం చేయబోతుందోనని ముందుగానే ప్రజలందరికీ క్లారిటీ ఇచ్చారు. నాటి నుంచి నేటి వరకు కూడా వైసీపీ ప్రతిపక్షాలపై ఎదురుదాడితోనే కాలం వెళ్లదీస్తూ ముందుకు కదులు తప్పా.. సమస్య పరిష్కారానికి చొరవ చూపకపోవడం శోచనీయంగా మారుతోంది.

Power Crisis

ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే చాలు వారందరినీ ప్రభుత్వం పోలీసులతో గృహ నిర్భంధాలు చేయడం, అరెస్టులు చేయిస్తోంది. ముఖ్యంగా టీడీపీ, జనసేన నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. అసెంబ్లీ సాక్షిగా వ్యక్తిగత దూషణలకు సైతం వెనుకాడటం లేదు. వైసీపీ అవినీతిపై టీడీపీ నేతలు ప్రశ్నిస్తే మీరేమైనా తక్కువ చేశారా? అంటూ ఆరోపణలకు దిగుతూ అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు.

తాజాగా ఏపీలోని కరెంట్ కోతల విషయంలోనూ వైసీపీ నేతలు ఇలాగే వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. నిజానికి దేశంలో ఏ రాష్ట్రంలోనూ కరెంట్ కోతల్లేవు. కానీ వైసీపీ నేతలు దేశ వ్యాప్తంగా విద్యుత్ కోతలు ఉన్నాయని చెబుతున్నారు. అందువల్లే ఏపీలో కరెంట్ కోతలు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేస్తూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

అయితే ఏపీ కంటే తక్కువ విద్యుత్ సామర్థ్యం ఉన్న తెలంగాణలో కరెంట్ కోతలు లేవు. అలాగే పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడులోనూ కరెంట్ కోతల్లేవు. ఈ రాష్ట్రాల్లో ఏసీలు వాడొద్దని సూచనలు చేసిన దాఖలాలు కూడా లేవు. అయితే వైసీపీ నేతలు మాత్రం పాత మీడియా క్లిప్పింగ్స్ ను చూపిస్తూ వైసీపీ నేతలు తప్పుడు విమర్శలకు దిగుతున్నారు.

ఏపీలో కాకుండా దేశ వ్యాప్తంగా కరెంట్ కోతలు ఉన్నాయంటూ తమను తాము మోసం చేసుకుంటూ ఏపీ ప్రజలను సైతం మోసం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందస్తుగా విద్యుత్ కోనుగోలు చేయడంలో ఏపీ సర్కారు పూర్తిగా విఫలమైంది. అయినప్పటికీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండటం విడ్డూరంగా మారింది.

ఏపీ సర్కారు కేవలం సంక్షేమాన్ని నమ్ముకొని పాలనను గాలికొదిలిస్తోంది. ప్రజలు ఏం చేసినా చేయకపోయినా పథకాల పేరుతో డబ్బులు వేస్తోంది. వీరే తమను వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తారని వైసీపీ భావిస్తోంది. అయితే రెండేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో వీరంతా ఓటు వేస్తారో లేదో తెలియదు గానీ ఇప్పటి నుంచి పాలనను వైసీపీ నేతలు పట్టించుకోకపోవడంపై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.