ఏపీలో కర్ఫ్యూ: వేటికి అనుమతంటే?

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా శనివారం రాత్రి నుంచి ఏపీ వ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తున్నట్లు జగన్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి కర్ఫ్యూలో వేటిని తెరవాలి? వేటిని మూయాలి? ఎవరికి అనుమతి ఉంది? ఎవరికి లేదు? రాత్రి ఏఏ టైంలో బయట ఉండొచ్చు అనే విధివిధానాలను తాజాగా ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో కరోనా కట్టడిలో భాగంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు […]

Written By: NARESH, Updated On : April 24, 2021 6:34 pm
Follow us on

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా శనివారం రాత్రి నుంచి ఏపీ వ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తున్నట్లు జగన్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి కర్ఫ్యూలో వేటిని తెరవాలి? వేటిని మూయాలి? ఎవరికి అనుమతి ఉంది? ఎవరికి లేదు? రాత్రి ఏఏ టైంలో బయట ఉండొచ్చు అనే విధివిధానాలను తాజాగా ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీలో కరోనా కట్టడిలో భాగంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఎవ్వరూ బయట కనిపించవద్దు. కనిపిస్తే తీవ్ర కఠిన చర్యలు ఉంటాయి. రాత్రి పూట పూర్తి కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. అన్ని కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, రెస్టారెంట్లు, హోటల్లు మూసివేయాలి.

ఇక కరోనా వేళ కర్ఫ్యూ వేళ ఒక్క ఆస్పత్రులు, ఫార్మసీలు, డయాగ్నోస్టిక్ ల్యాబ్ లు, అత్యవసర సర్వీసులు మాత్రమే పనిచేస్తాయి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలి కమ్యూనికేషన్స్, ఇంటర్నెట్, కేబుల్ సేవలు, పెట్రోల్ పంపులు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా పంపిణీ సంస్థల కార్యాలయాలు కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చారు.

ఈ రంగాల వ్యక్తులు, సిబ్బంది మినహా ఎవరూ కూడా రాత్రి పూట రాకపోకలు సాగించడానికి వీల్లేదని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులుజారీ చేసింది. ప్రజారవాణాతోపాటు ఆటోలు ఇతర వాహనాలు నిర్ణీత కర్ఫ్యూ వేళల వరకూ మాత్రమే అనుమతించారు.