https://oktelugu.com/

CUET PG 2025 : CUET PG రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? చివరి తేదీలు?

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) 2025-26 విద్యా సంవత్సరానికి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ – పోస్ట్ గ్రాడ్యుయేట్ (CUET PG) ప్రోగ్రామ్‌ల కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 3, 2025 / 12:03 PM IST

    CUET PG 2025

    Follow us on

    CUET PG 2025 : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) 2025-26 విద్యా సంవత్సరానికి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ – పోస్ట్ గ్రాడ్యుయేట్ (CUET PG) ప్రోగ్రామ్‌ల కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అర్హత గల అభ్యర్థులు ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్ nta.ac.inని చెక్ చేసుకోవచ్చు. లేదా exam.nta.ac.in/CUET-PG ద్వారా కూడా మీరు CUET PG 2025 పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    ఆసక్తి గల అభ్యర్థులు CUET PG పరీక్షకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 1, 2025. రోజు (11:50 pm) వరకు గడుపు ఉంటుంది. ఇక అధికారిక షెడ్యూల్ ప్రకారం, దరఖాస్తు ఫారమ్ మార్పులు చేసుకునే అవకాశం ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 5, 2025 వరకు రాత్రి 11:50 గంటలకు వరకు మాత్రమే ఉంటుంది.

    CUET PG 2025 పరీక్ష తేదీ: పరీక్ష మార్చి 13, 2025 నుంచి మార్చి 31, 2025 మధ్య జరిగే అవకాశం ఉంది. CUET PG ప్రోగ్రామ్ ద్వారా మొత్తం 157 సబ్జెక్టులు ఉంటాయి. భారతదేశంలో ఉన్న 27 రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా 312 నగరాల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు.

    రిజిస్ట్రేషన్ జనవరి 3న అంటే ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 1 రాత్రి 11:50 గంటల వరకు అప్లే చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక రుసుము చెల్లించడానికి సమయం 2 ఫిబ్రవరి వరకు ఇచ్చారు. మీ అప్లికేషన్ లో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటే ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు రాత్రి 11:50 గంటలకు చేసుకునే అవకాశం ఉంటుంది.

    CUET PG 2025 పరీక్షా విధానం:
    ఈ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ (CBT) విధానంలో నిర్వహిస్తారు. అభ్యర్థులకు మొత్తం 100 బహుళైచ్ఛిక ప్రశ్నలు (MCQలు) ఇస్తారు. పరీక్ష వ్యవధి ఒక గంట 30 నిమిషాలు ఉంటుంది. CUET PG 2025 లో ఆన్సర్లను మార్కింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు ఇస్తే, ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తీసివేస్తారు. సమాధానం లేని ప్రశ్నలకు మార్కులు ఉండవు. తీసి వేయరు.

    సామాజిక వర్గం దరఖాస్తు రుసుము (గరిష్టంగా రెండు పరీక్ష పేపర్లకు) అదనపు పరీక్ష పేపర్ల కోసం రుసుము (ప్రతి పరీక్ష పేపర్)

    జనరల్ అభ్యర్థులు 1400 700

    OBC-NCL/Gen EWS 1200 600

    SC/ST/థర్డ్ జెండర్ 1100 600

    పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ 1000 600

    CUET PG 2025: ఎలా దరఖాస్తు చేయాలి?
    CUET PG exam.nta.ac.in/CUET-PG/ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి. లేదంటే ఈ లింక్ ను క్లిక్ చేసి కూడా మీరు మీ అప్లికేషన్ ను పూర్తి చేసుకోవచ్చు.
    హోమ్‌పేజీలో “CUET-PG 2025 కోసం నమోదు చేసుకోవాలి. ఇప్పుడు live మీద క్లిక్ చేయాలి.
    రిజిస్ట్రేషన్ విండో ఓపెన్ అవుతుంది. “న్యూ రిజిస్ట్రేషన్” ఎంపికపై క్లిక్ చేయండి.
    అన్ని సూచనలను జాగ్రత్తగా చదవి దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
    పేర్కొన్న ఫార్మాట్‌లో అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయండి.
    దరఖాస్తు రుసుమును చెల్లించండి, తర్వాత అవసరా కోసం ఆ కాపీని మీ వద్ద ఉంచుకోవాలి.