https://oktelugu.com/

Tirumala : అంతర్యామీ.. తిరుమలలో మళ్లీ ఏమిటిదీ స్వామి!

Devotees of Tirumala : తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం భక్తులు పోటెత్తడంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. దీనిపై అందరు ముందే హెచ్చరించారు. టీటీడీ చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని కోరినా ఫలితం కనిపించడం లేదు. టీటీడీ అధికారుల్లో నిర్లక్ష్యమే కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీంతోనే భక్తుల మధ్య తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు పలు ఆరోపణలు వస్తున్నాయి. శ్రీవారి దర్శనానికి భక్త జనం ఎగబడటంతోనే ఇలా జరిగినట్లు చెబుతున్నారు. ఎన్ని దెబ్బలు తగిలినా అధికారుల్లో మార్పు […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 1, 2023 / 09:46 PM IST
    Follow us on

    Devotees of Tirumala : తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం భక్తులు పోటెత్తడంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. దీనిపై అందరు ముందే హెచ్చరించారు. టీటీడీ చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని కోరినా ఫలితం కనిపించడం లేదు. టీటీడీ అధికారుల్లో నిర్లక్ష్యమే కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీంతోనే భక్తుల మధ్య తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు పలు ఆరోపణలు వస్తున్నాయి. శ్రీవారి దర్శనానికి భక్త జనం ఎగబడటంతోనే ఇలా జరిగినట్లు చెబుతున్నారు. ఎన్ని దెబ్బలు తగిలినా అధికారుల్లో మార్పు రావడం లేదు. ఫలితంగానే ఇలా జరుగుతున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు.

    జనవరి 2 నుంచి 11 వరకు పది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. రోజుకు 45 వేల చొప్పున పది రోజులకు 4.5 లక్షల సర్వదర్శనం టోకెన్లు అందజేశారు. దీంతో వైకుంఠ ఏకాదశి పర్వదిన శ్రీవారి సర్వ దర్శనం కోసం భక్తులు భారీగా విచ్చేశారు. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో బారులు తీరారు. జనవరి 1నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని ప్రకటించడంతో భక్తులు భారీగా తరలారు. ముందు రోజు రాత్రి భక్తులు అన్ని కేంద్రాల వద్ద భక్తులు వేచి ఉన్నారు.

    దీంతోనే తోపులాట జరిగింది. ఇందులో పలువురు భక్తులు కిందపడిపోయారు. సంఘటనపై జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, టీటీడీ జేఈవో సదాభార్గవి పరిశీలించారు. క్యూలైన్లు, బారికేడ్లు ఎలా ఉన్నాయని చూశారు. మున్సిపల్ సిబ్బంది, పారిశుధ్య సిబ్బందితో పని చేయించుకోవాలని సూచించారు. మరుగుదొడ్ల నిర్వహణ, తాగునీటి సరఫరా వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. నిరంతరం ఏర్పాట్లు పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు.

    టోకెన్లు జారీ చేసే ప్రదేశాల్లో స్క్రీన్లు పనిచేయడానికి ఏర్పాట్లు ముమ్మరం చేయాలి. టోకెన్లు ఇచ్చే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారుల తీరుతోనే తొక్కిసలాట జరిగినట్లు గుర్తించారు. వారు సక్రమంగా పనిచేసి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఇదివరకే భక్తుల మధ్య తొక్కిసలాట జరుగుతుందని హెచ్చిరికలు చేసినా వారు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించారు. దీంతోనే స్వల్ప తొక్కిసలాట జరగడంతో భక్తులు ఆందోళన చెందారు. ఇకనైనా అధికారులు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చక్కగా చేయాలని సూచిస్తున్నారు.