పంట కొనుగోలు… గడువు పెంపు!

తెలంగాణలో పంట కొనుగోలు కేంద్రాల గడువును పెంచారు. జూన్‌ 8 వరకు కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.  మొదట మే 31 వరకే కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పలు ప్రాంతాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు జూన్‌ 8 వరకు కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. వర్షాలు రాకముందే రైతులు పంటలను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకోవాలని సూచించారు. కరోనా నేపథ్యంలో ఎదురైన అనేక సవాళ్లను అధిగమించి ఈ […]

Written By: Neelambaram, Updated On : May 30, 2020 7:02 pm
Follow us on

తెలంగాణలో పంట కొనుగోలు కేంద్రాల గడువును పెంచారు. జూన్‌ 8 వరకు కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.  మొదట మే 31 వరకే కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పలు ప్రాంతాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు జూన్‌ 8 వరకు కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. వర్షాలు రాకముందే రైతులు పంటలను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకోవాలని సూచించారు.

కరోనా నేపథ్యంలో ఎదురైన అనేక సవాళ్లను అధిగమించి ఈ సారి ప్రభుత్వ రంగ సంస్థలు రికార్డుస్థాయి కొనుగోళ్లు చేపట్టాయి. దేశవ్యాప్తంగా ఎఫ్‌సీఐ ఈ యాసంగిలో ఇప్పటిదాకా 83.01 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా, అందులో తెలంగాణ నుంచే 52.23 లక్షల టన్నులు సేకరించారు. ఈ సారి ఎఫ్‌సీఐ 91.07 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, అందులో సగానికి పైగా ఇప్పటికే తెలంగాణ సమకూర్చింది. తెలంగాణలో ఈ యాసంగిలో ఎక్కువ వరి పంట పండినందున అది దేశ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడిందని ఎఫ్‌సీఐ ఒక ప్రకటనలో తెలిపింది.