అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి

కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు, ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ కోరారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఊహించిన దానికన్నా ఎక్కువగా కరోనా వ్యాధి ప్రబలుతోందన్నారు. ఇప్పటికే 300లకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. లాక్ డౌన్ కారణంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదల పరిస్థితి దయనీయంగా తయారైందని తెలిపారు. మరో పక్క రైతులు పండించిన […]

Written By: Neelambaram, Updated On : April 7, 2020 12:35 pm
Follow us on


కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు, ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ కోరారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన లేఖ రాశారు.

రాష్ట్రంలో ఊహించిన దానికన్నా ఎక్కువగా కరోనా వ్యాధి ప్రబలుతోందన్నారు. ఇప్పటికే 300లకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. లాక్ డౌన్ కారణంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదల పరిస్థితి దయనీయంగా తయారైందని తెలిపారు. మరో పక్క రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదన్నారు. నిల్వ చేసుకోలేని కూరగాయలు, పండ్లు వంటి పంటలు రైతులు అమ్మకోలేని స్థితి, వినియోగదారునికి అందుబాటులోలేని స్థితి నెలకొందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు 7000 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కరోనా విపత్తుపై చర్చించేందుకు ప్రధాని సైతం ఈ నెల 8వ తేదీన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తక్షణమే ఆంధ్రప్రదేశ్ లో కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయవలని డిమాండ్ చేశారు.