CPI Narayana: కమ్యూనిస్టులంటే కరడుగట్టిన ఛాందసవాదులంటారు. వారు ఏదైనా మాట్లాడితే దానిపై పూర్తి అవగాహన, ఆధారాలు ఉంటేనే మాట్లాడతారు. కానీ ఇటీవల కాలంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నోటికి వచ్చిందే మాట్లాడుతున్నారు. ఎవరిపై పడితే వారిపైనే ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ పై ఘాటు విమర్శలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. నారాయణ లాంటి పెద్ద మనిషి ఇలా బరితెగించి మాట్లాడటమేమిటని అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆయనకు వయసైపోతోంది అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారనే వాదనలు కూడా వస్తున్నాయి. రాజ్యాంగ బద్ధంగా నియమించబడిన వ్యక్తి గవర్నర్. ఆయన ప్రభుత్వాలు ఏది చెబితే అది చెబుతారు కానీ వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండదని నారాయణకు తెలియదా? అనే నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. నారాయణ నోటి వెంట మంచి మాటలకు బదులు పచ్చి బూతులే వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కూడా బిగ్ బాస్ షో పై సంచలన కామెంట్లు చేశారు. బిగ్ బాస్ హౌస్ బ్రోతల్ హౌస్ అని నాగార్జున అంటే తనకు అసహ్యమని మాట్లాడటం తెలిసిందే. ఒక కమ్యూనిస్టు నేత ఇలా బరితెగించి మాట్లాడటంపై అందరిలో సందేహాలు వస్తున్నాయి. ఆయనకు పిచ్చిపట్టినట్లు ఉందని చెబుతున్నారు. మానసిక స్థితి సరిగా లేని వారు ఇలాగే మాట్లాడతారనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో గవర్నర్ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు మధ్య ఏజెంటుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేయడం ఆయన స్థాయికి తగింది కాదు. బాధ్యతా యుతమైన పదవిలో లేకున్నా ఇలా రెచ్చిపోయి మాట్లాడటం పిచ్చివాడి పనిగానే అభివర్ణిస్తున్నారు. గవర్నర్ పాత్రపైనే విమర్శలు చేయడం ఆయనకే చెల్లుతోంది. ఎవరైనా తప్పు చేస్తే సముదాయించాల్సింది పోయి ఆయనే తప్పు చేస్తే ఎవరు బుద్ది చెబుతారని ప్రశ్నిస్తున్నారు.
మొత్తానికి నారాయణ వ్యవహారంతో అందరు నారాయణ నారాయణ అంటున్నారు. నారదుడికి మల్లే గొడవలు సృష్టించడం ఆయనకు సరదాగా కనిపిస్తోంది. అందుకే ఇలా గవర్నర్ పై ఆరోపణలకు దిగడం ఆయన నైతికతకు మంచిది కాదు. పెద్ద మనిషి హోదాలో గౌరవం అందుకోవాలే కానీ చీత్కారాలు సరైనవి కావని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తిస్తే మంచిది.
[…] Also Read: CPI Narayana: నారాయణ.. నారాయణ.. ఏంటీ బూతు బాగోతం […]