CP Series On Rave Party: హైదరాబాద్ రేవ్ పార్టీ జరిగిందనే వార్తలు ఉదయం నుంచి సంచలనం రేపుతున్నాయి. హైదరాబాద్ లోని ర్యాడిసన్ బ్లూ హోటల్ లోని ఫండింగ్ మింక్ పబ్ లో జరిగిన ఈ పార్టీపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి జరిపి దాదాపు 150మందిని పట్టుకున్నారు. ఇందులో టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు ఉండటంతో అందరూ షాక్ అయిపోతున్నారు.

ఇందులో మెగా డాటర్ నిహారిక, ఫేమస్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నారు. అయితే వారందరికీ ఉదయం వరకు పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు.. వారికి నోటీసులు ఇచ్చి పంపించేశారు. వీరిని త్వరలోనే విచారణకు పిలిచే అవకాశం కూడా ఉంది. అయితే ఈ ఘటనపై సీపీ ఆనంద్ యాక్షన్ తీసుకున్నారు.
Also Read: Niharika Konidela: నిహారిక అర్ధరాత్రి నుంచి అక్కడే ఉందట
ఈ పబ్ లో ఎప్పటి నుంచో డ్రగ్స్ వాడుతున్నారని స్థానికులు పలుమార్లు చెప్పినా.. పోలీసులు పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. పైగా పోలీస్ స్టేషన్ కు దగ్గరలోనే ఇంత పెద్ద ఎత్తున పార్టీ జరుగుతున్నా నిర్లక్ష్యంగా ఉన్నారని ఆ స్టేషన్ సీఐ శివచంద్రను సస్పెండ్ చేశారు సీపీ ఆనంద్. అలాగే ఏసీపీకి చార్జ్ మెమో పంపించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని చెప్పారు.

ఇక ఇదే ఘటనపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ స్పందించారు. తన కొడుకు ఆ పార్టీలో ఉన్నాడనే వార్తలను ఆయన ఖండించారు. తన కొడుకు కేవలం ఫ్రెండ్ పుట్టినరోజు పార్టీకే వెళ్లాడని క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి కల్చర్‌ను తాము ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నామని, హైదరాబాద్ లో ఇలాంటి పబ్ లను బ్యాన్ చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఈ కల్చర్‌ను బ్యాన్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరుఫున పోరాడుతామన్నారు.
Also Read:ICC Women’s World Cup Final: మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఏడోసారి జగజ్జేత..
[…] Sai Pallavi: హీరోయిన్ సాయి పల్లవి అంటేనే హోమ్లీ బ్యూటీ. ఫ్యామిలీ హీరోయిన్. సింపుల్ గా చెప్పాలంటే… సాయిపల్లవి రెగ్యులర్ హీరోయిన్లకు పూర్తి భిన్నం. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ లు కుటుంబ బంధాలను బలంగా చాటే విధంగా ఉంటాయి. తాజాగా సాయి పల్లవి ఉగాది పర్వదినాన్నిపురష్కరించుకుని.. ఆమె రైతుగా మారింది. కూలీలతో కలిసి పనులు చేసింది. […]
[…] Balakrishna New Look: నట సింహం బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా నుంచి తాజాగా ‘బాలయ్య లుక్’ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ విలన్ గా నటిస్తున్నాడు. ఉగాది సందర్భంగా బాలయ్యకు పూల బుకే ఇస్తూ దిగిన ఫొటోని దునియా విజయ్ షేర్ చేశాడు. బాలయ్య ఓల్డ్ గెటప్‌లో మాస్ గా కనిపించగా, దునియా విజయ్ అందుకు తగ్గట్టు పవర్‌ఫుల్ గెటప్‌లో కనిపించాడు. […]
[…] Pakistan National Assembly Dissolved: పాకిస్తాన్ ప్రధానమంత్రిపై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా పోయింది. దీంతో పాక్ లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇదివరకు కూడా అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగకుండా నిలిచిపోయిన సంఘటనలున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ కూడా అవిశ్వాస తీర్మానంపై చర్చకు రాకుండా చేసుకుని పదవీ గండం నుంచి గట్టెక్కారు. […]
[…] Telangana Job Notification: తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైందని ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఇక ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా రంగంలోకి దిగారు. పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. కానీ ప్రభుత్వం నోటిఫికేషన్ల విడుదలతో జాప్యం చేస్తోంది. ఫలితంగా అభ్యర్థులకు శాపంగా మారుతోంది. ఇకనైనా తమ భవిష్యత్ మారుతుందని భావించినా దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా పరిస్థితి మారటం కనిపిస్తోంది. […]
[…] KCR vs Modi: వరి కొనుగోలు అంశాన్ని తెర మీదకు తెచ్చి కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీ వేదికగా పోరుబాట పట్టాలని నిర్ణయించారు. వారం రోజుల పాటు అక్కడే మకాం వేసి ఉద్యమం ఉధృతం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈపాటికే ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఈనెల 11 న ఢిల్లీలో నిరసన చేపట్టేందుకు ప్రణాళిక ఖరారైంది. ఆదివారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇక అక్కడే మకాం వేసి బీజేపీ వ్యతిరేక శక్తులను కలిసి వారితో ఉద్యమం చేయాలని భావిస్తున్నారు. […]