Haryana Elections 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 5న జరుగనున్నాయి. దీంతో రాష్ట్రంలో ప్రచారం జోరందుకుంది. సుమారు వెయ్యి మంది 90 స్థానాల కోసం పోటీ పడుతున్నారు. ఎన్నికలకు మరో వారం మాత్రమే గడువు ఉంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో గో సంరక్షణ కూడా ఎన్నికల ప్రచారాస్త్రంగా మారింది. పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ గో సంరక్షణకు చట్టం చేసింది. గోవధను నిషేధించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓట్ల కోసం దీనిని తమకు అనుకూలంగా మార్చకునే ప్రయత్నం చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే గోసంరక్షణ పేరుతో హత్యలకు వ్యతిరేకంగా చట్టం చేస్తామని నూహ్ ఎమ్మెల్యే అఫ్తాబ్ అహ్మద్ హామీ ఇచ్చారు. బీజేపీ గోసంరక్షణ పేరుతో అనే మందిని హత్య చేయించిందని ఆరోపించారు. ‘గతేడాది నుహ్ జిల్లాను కుదిపేసిన మత హింస, ’గో రక్షకుల’ వేషధారణలో బీజేపీ సంఘ వ్యతిరేకుల ప్రచారం కారణంగా, వారు భయాందోళనలను సృష్టించారు. ఎమ్మెల్యేగా, నేను దానిని తీసుకువచ్చాను. ’మీరు అలాంటి సంఘటనలను నిరోధించాలి’ అని అడ్మినిస్ట్రేషన్ నోటీసు, కానీ వారు దానిని జరిగేలా అనుమతించారు‘ అని అహ్మద్ తెలిపారు.
గతేడాది హోం గార్డుల హత్య..
ఇక గతేడాది వీహెచ్‌పీ తీసిన ర్యాలీ సందర్భంగా ఇద్దరు పోలీసులు కూడా హత్యకు గురయ్యారన్నారు. ర్యాలీ సందర్భంగా ఇరు వర్గాలు సవాళ్లు విసురుకున్నాయని, అయినా ప్రభుత్వం వీమెచ్‌పీ ర్యాలీకి అనుమతి ఇవ్వడంతో నూహ్‌లో అల్లర్లు చెలరేగాయి. ఈ సందర్భంగా ఇరువర్గాల దాడిలో ఇద్దరు హోంగార్డులు, ఒక మతగురవుతోపాటు ఆరుగురు మరణించారు. ఈ కేసులో కాంగ్రెస్‌కు చెందిన ఫిరోజ్‌పూర్ జిర్కా ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్‌పై పోలీసులు ఆ తర్వాత చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (ఉప) అభియోగాలను మోపారు.
గొడవ తర్వాత హింస..
ఇదిలా ఉంటే.. నూహ్‌లో గొడవ తర్వాత హింస చెలరేగింది. ఒకవర్గం వారిని టార్గెట్‌గా దాడులు జరిగాయి. ఇళ్లు కూల్చివేశారు. మత ఘర్షణలు చెలరేగాయి. దీనిని గుర్తు చేస్తూ కాంగ్రెస్ ఇప్పుడు ప్రచారం చేస్తోంది. సామరస్యంగా జీవించాలని సూచిస్తోంది. ఇందుకోసం గో సంరక్షణ పేరుతో హింసకు వ్యతిరేకంగా చట్టం తెస్తామంటోంది. గోసంరక్షకుల వేషధారణలో ఉన్న సామాజిక వ్యతిరేక శక్తులను అణచివేస్తామని పేర్కొంటోంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Cow protection as a campaign tool in haryana elections bjp in favor congress against
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com