Covid Third Wave: కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. మూడో దశ ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా నిరంతరంగా కొనసాగుతోంది. దేశంలో దాదాపు 75 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు చెబుతున్నారు. అయితే రానున్న రోజుల్లో కరోనా ఎప్పటికి ఉండిపోయే (ఎండమిక్) దశలోకి మారే సూచనలు కనిపిస్తున్నాయని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో మనం నిరంతరం కరోనాతో సహవాసం చేయాల్సిందే అని చెబుతున్నారు. కొత్త వేరియంట్లు వెలుగులోకి వస్తున్న క్రమంలో థర్డ్ వేవ్ పై అంతగా భయపడాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.
అయితే ఎండమిక్ దశలో కి మారినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. వ్యాధి నియంత్రణలోనే ఉంటుందని సూచిస్తున్నారు. అధిక జనాభా కలిగిన మన దేశంలో రోగనిరోధక శక్తిని బట్టి చూస్తే కరోనా పరిస్థితుల్లో తేడాలు వస్తున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంలో ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్నా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు.
కొవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్న వారిలో కూడా ఇమ్యూనిటీ శక్తి ఉన్నా కరనా సోకే ముప్పు ఉంటుందని గుర్తించుకోవాలని సూచిస్తున్నారు. ప్రజల అప్రమత్తతే శ్రీరామరక్షగా చెబుతున్నారు. అందుకే ప్రజలు వ్యాక్సినేషన్ తీసుకుని జాగ్రత్తగా ఉండాల్సిందే. వ్యాక్సిన్ పొందిన వారికి కూడా 20 నుంచి 30 శాతం వ్యాధి సోకే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. దీంతో కొత్త వేరియంట్లపై ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
వ్యాక్సినేషన్ తీసుకున్నా రోగ నిరోధక శక్తి వంద రోజుల తరువాత క్రమంగా క్షీణిస్తుంది. దీంతో కొత్త వేరియంట్ల ప్రభావం వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు నిబంధనలు పాటించాల్సిందే. మూడో దశ ముప్పును రాకుండా చేయడంలో ప్రజల పాత్రే కీలకం కానుంది. ప్రస్తుతం పండుగల సీజన్ కావడంతో ప్రజలు మరింత అప్రమత్తత పాటిస్తూ కరోనా నిర్మూలనకు తోడ్పడాలి. నిబంధనలు పాటించాలి.