Homeజాతీయ వార్తలుMunugodu By-Elections Counting : ఒంటి గంట కల్లా తుది ఫలితం: మునుగోడు ఓట్ల లెక్కింపు...

Munugodu By-Elections Counting : ఒంటి గంట కల్లా తుది ఫలితం: మునుగోడు ఓట్ల లెక్కింపు జరుగుతోంది ఇలా!

Munugodu by-elections Counting  : నోట్లు కట్టలు తెంచుకున్నాయి.. మద్యం ఏరులై పారింది.. వేలాది గొర్రె పోతులు బిర్యానీలోకి ముక్కలయ్యాయి. ఇక చికెన్ సంగతి చెప్పాల్సిన పని లేదు. తాయిలాలకు లెక్కలేదు. ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. ఎవరు కోవర్టో అర్థం కాదు. రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది మునుగోడు.. అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా చరిత్ర సృష్టించింది. ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది మునుగోడు ఉప ఎన్నిక.. 93% పోలింగ్ తో కొత్త రికార్డు సృష్టించింది. ఇన్ని ఘనతలు సాధించిన మునుగోడు ఉప్పు ఎన్నికలు విద్యుత్ ఎవరో మరి కొన్ని గంటల్లో తేలిపోతుంది. విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందోననే ఉత్కంఠకు తెరపడనుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లని లెక్కిస్తారు.. ఉదయం ఎనిమిది గంటల 30 నిమిషాలకు తొలి రౌండు లెక్కింపు పూర్తవుతుంది.. ఒక రౌండ్ ఫలితం వెలువడెందుకు 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతుంది. తుది ఫలితం మధ్యాహ్నం ఒంటిగంటకు వెలువడుతుంది. ఓట్ల లెక్కింపును ఆర్జాల బావి వద్ద ఉన్న గోదాములో చేపట్టేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ హాల్లో 21 లేబుళ్లు ఏర్పాటు చేశారు. 15 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. 2009 పోలింగ్ బూత్ లలోని ఈవీఎంల ఓట్లను లెక్కించేందుకు ఐదు గంటల సమయం పడుతుందని అంచనా. ఉదయం 7:30 నిమిషాలకు ఎన్నికల కమిషన్ పరిశీలకులు, పోటీలో ఉన్న అభ్యర్థులు, ఏజెంట్ సమక్షంలో స్ట్రాంగ్ రూములు తెరిచి ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రానికి తరలిస్తారు. ఎన్నికల కమిషన్ ఈటిపిబిఎస్ సాఫ్ట్వేర్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తి కాగానే చౌటుప్పల్ మండలం ఈవీఎంలను లెక్కిస్తారు. ఆ తర్వాత వరుస క్రమంలో సంస్థాన్ నారాయణపురం, మునుగోడు, మర్రిగూడ, నాంపల్లి, గట్టుపల్ మండలాల ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపులో మొత్తం 250 మంది సిబ్బంది పాల్గొంటారు. వీరిలో వందమంది ఓట్ల లెక్కింపులో నిమగ్నం అవుతారు. కౌంటింగ్ లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే మూడు విడతలుగా శిక్షణ ఇచ్చారు. వారంతా కూడా శనివారం రిహార్సల్స్ చేశారు.

-కనీ వినీ ఎరుగని భద్రత

మొన్న పోలింగ్ కు ముందు పలి మెల దగ్గర జరిగిన ఘర్షణను దృష్టిలో పెట్టుకొని కౌంటింగ్ కేంద్రం లోపల, బయట నిఘా, సివిల్, ఏఆర్, పారా మిలిటరీ బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్లోపల భారీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.. వీటిని రిటర్నింగ్ అధికారి చాంబర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానం చేశారు. కౌంటింగ్ హాల్ బయట లెక్కింపు కేంద్రం నుంచి 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఓట్ల లెక్కింపునకు మూడంచెల భద్రత కల్పించారు. బయట రెండు అంచెల భద్రతను రాష్ట్ర పోలీసులు, కౌంటింగ్ కేంద్రం లోపల కేంద్ర బలగాలు భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. 150 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు, 470 మంది సివిల్ పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు.

-ఇదీ ఓటర్ల సంఖ్య

మునుగోడు లో మొత్తం 2,41,805 మంది ఓటర్లు ఉన్నారు. ఉప ఎన్నికల్లో 2,25,192 తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీని ప్రకారం నియోజకవర్గంలో 93 శాతం పోలింగ్ నమోదయింది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 686 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక 50 మంది సర్వీస్ ఓట్ల ద్వారా తమ హక్కు వినియోగించుకున్నారు. 2018 లో జరిగిన ఎన్నికల్లో మధిర నియోజకవర్గం లో నమోదైన పోలింగ్ అత్యధిక రికార్డ్ గా ఉండేది. కానీ ఇప్పుడు దానిని మునుగోడు చెరిపి వేసింది. ఏకంగా 93% పోలింగ్ తో నయా రికార్డు సృష్టించింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version