Mudragada Padmanabham: కాపులకు ఐకాన్ లాంటి వ్యక్తి అయిన ముద్రగడ పద్మనాభం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఈ మధ్య ఆయన తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో సైలెంట్ గా ఉన్న ఆయన ఇప్పుడు ఏదో ఒక లేఖతో ప్రచారంలోకి వస్తున్నారు. ఆయన పార్టీ పెట్టబోతున్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఓ లేఖ ద్వారా స్పందించారు. అయితే ఇందులో పార్టీ గురించి చెప్పకుండా ఇతర విషయాలను మాట్లాడారు.

కాగా ఆయన లేఖకు జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ కౌంటర్ లేఖను రాశారు. ఈ లేఖ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అయితే ముద్రగడ లేఖలో దళిత, బీసీలు, కాపు సోదరులను ఉద్ధేశించి లేఖ రాశారు. అందులో మనమంతా ఎప్పటి నుంచో బానిసలుగా ఉంటున్నామని, మనకు ఎందుకు అధికారం రావొద్దని అడిగారు. అంతే కాకుండా జనాభా ఎక్కువ ఉన్న మనకు కాకుండా కొద్దిగా జనాభా ఉన్న కొన్ని వర్గాలు మాత్రమే అధికారాన్ని అనుభవిస్తున్నాయని ఆయన కామెంట్లు చేశారు.
Also Read: తమ రెమ్యునరేషన్ ను తిరిగి ఇచ్చేసిన 9 మంది స్టార్లు వీళ్ళే !
పోరాడాలని, అడిగితే అధికారం దక్కదని చెప్పారు. అయితే ఈ లేఖ మీద కూసంపూడి శ్రీనివాస్ కౌంటర్ మామూలుగా లేదు. ఆయన రాసిన లేఖలో ముద్రగడ లేఖకు ప్రతి పాయింట్‌కు కౌంటర్ వేశారు. జనాభా ఎక్కువ ఉందని అధికారం ఇవ్వమని అడగడమేంటండి అంటూ సెటైర్ వేశారు. అంతే కాకుండా తాము బానిసలం కాదని, మార్పు కోసం పోరాగే సైనికులం అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా జనాభా తక్కువ ఉన్న వర్గాలకు హక్కు లేదా అంటూ ప్రశ్నించారు.
బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, మైనార్టీ లాంటి వర్గాలకు చెందిన వారు కూడా హక్కుల కలిగిన వారే అంటూ కౌంటర్ విసిరారు. జనాభా ప్రాపతిపదికన అధికారం కావాలని అడగకుండా.. కులాల పేరు ఎందుకు అని అడిగారు. ఆ రెండు కుటుంబాలకేనా అధికారం అని అడిగాలి గానీ కులాల ప్రతిపాదన తీసుకు వస్తే మంచిది కాదన్నారు. కుల రహిత సమాజాన్ని నిర్మించాలంటే కులాలను కలుపుకుని పోవాలి గానీ ఇలా కులల మధ్య చిచ్చు పెట్టడం ఏంటంటూ మండిపడ్డారు. జగన్ ఇమేజ్ డ్యామేజ్ అయినప్పుడల్లా ఇలా తెరమీదకు వచ్చి ప్రజల దృష్టిని మరల్చడం ఏంటంటూ మండిపడ్డారు.
Also Read: బాలయ్య అన్ స్టాపబుల్ షో కి రానున్న ఆ హీరో… ఎవరో తెలిస్తే షాక్ అవ్వడం పక్కా!