
ఒక వంక అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తూ ఉండటం, మరోవంక కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చే సూచనలు కనిపించక పోతూ ఉండడంతో ఇప్పటి వరకు గాంభీర్యంగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లో బహుశా మొదటిసారిగా నిస్సహాయ స్థితి వ్యక్తం అవుతున్నది.
ఇప్పటి వరకు కరోనాను కట్టడి చేయబోతున్నామని, కొద్దీ కాలంలో అమెరికా ఆర్ధిక వ్యవస్థ తిరిగి నిలబడుతుందని చెబుతున్న ఆయనలో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయనే భయం వెంటాడుతున్నట్లు కనిపిస్తున్నది. అందుకనే కరోనా మరణాలను 1941లో అమెరికాపై జరిగిన పెరల్ హార్బర్ దాడితో పోల్చారు.
అంతే కాదు 2001 సెప్టెంబర్ 11న ప్రపంచ వాణిజ్య కేంద్రంపై జరిగిన ఉగ్రదాడికన్నా కరోనా మరణాలు దారుణంగా ఉన్నాయన్నారు. ఆ దాడిలో సుమారు మూడు వేలమంది చనిపోగా, ఇప్పుడు మరణాల సంఖ్య 60,000 కు చేరుకొంది.
తమ దేశంపై వైరస్‌తో చైనాయే దాడి చేసిందన్న అనుమానాలను ఆయన మరోసారి లేవనెత్తుతూ వైరస్‌ను నియంత్రించలేకపోయిన చైనాపై నష్టపరిహార దావా వేసేందుకు ఆలోచిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. వైరస్ ఎక్కడ పుట్టిందో అక్కడే నియంత్రించాల్సి ఉందని, చైనాలోనే వైరస్‌ను నియంత్రించి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదని స్పష్టం చేశారు.
విశాఖ గ్యాస్ లీక్ పై జగన్ కు ప్రధాని ఫోన్
మహమ్మారిని ఓ యుద్ధంలా చూస్తున్నారా అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ మహమ్మారిని అమెరికా శుత్రవుగా భావిస్తున్నట్లు చెప్పారు. కనిపించకుండా విధ్వంసం సృష్టిస్తున్న వైరస్‌ను శత్రువుగా భావిస్తున్నానని, ఆ వైరస్ ఇక్కడకు రావడం నచ్చడం లేదని, కానీ ఆ కనిపించని శత్రువును ఓ యుద్ధంలా చూస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
హవాయిలో ఉన్న పెరల్ హార్బర్‌పై జపాన్ ఆకస్మిక దాడి చేయడంతో అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనాల్సి వచ్చింది. అయితే ఆ ఘటనను ట్రంప్ గుర్తు చేశారు. అసలు ఇలాంటి సంఘటన జరగాల్సింది కాదని చెప్పారు.