కరోనాపై పోరుకు సిద్దమైన ఇస్రో!

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇస్రో ముందుకు వచ్చింది. షార్ లో ప్రస్తుతానికి వాహక నౌకల తయారీ నిలిపివేసి, కరోనాపై పోరాటంలో తమ వంతు సహకారాన్ని అందిస్తామని ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) ప్రకటించింది. ఇందులో భాగంగా అత్యాధునిక వైద్య పరికరాలను తయారు చేస్తామని పేర్కొంది. సులువుగా ఆపరేట్ చేయగల వెంటిలేటర్లు, ఆక్సిజన్ కెనిస్టర్లతో పాటు మాస్కుల తయారీని ప్రారంభిస్తామని వెల్లడించింది. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న విక్రమ్ సారాభాయ్ […]

Written By: Neelambaram, Updated On : March 30, 2020 12:10 pm
Follow us on

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇస్రో ముందుకు వచ్చింది. షార్ లో ప్రస్తుతానికి వాహక నౌకల తయారీ నిలిపివేసి, కరోనాపై పోరాటంలో తమ వంతు సహకారాన్ని అందిస్తామని ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) ప్రకటించింది. ఇందులో భాగంగా అత్యాధునిక వైద్య పరికరాలను తయారు చేస్తామని పేర్కొంది. సులువుగా ఆపరేట్ చేయగల వెంటిలేటర్లు, ఆక్సిజన్ కెనిస్టర్లతో పాటు మాస్కుల తయారీని ప్రారంభిస్తామని వెల్లడించింది. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఉద్యోగులు వీటిని డిజైన్ చేస్తారని, ఆపై తయారీ బాధ్యతలను పరిశ్రమలకు అప్పగిస్తామని వెల్లడించింది.

ఇప్పటికే ఈ సెంటర్ లో 1000 లీటర్ల శానిటైజర్ ను తయారు చేశామని, మాస్క్ ల తయారీలో ఉద్యోగులు పాలు పంచుకుంటున్నారని ఇస్రో ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇస్రో ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే, ప్రస్తుతానికి వాహక నౌకల తయారీని నిలిపి వేశామని తెలిపారు. శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో పీఎస్ఎల్వీ సీ-49, సీ-50 వాహక నౌకల అనుసంధాన పనులను కూడా ప్రస్తుతానికి నిలిపివేశామని వెల్లడించారు. ఇప్పటికే ఎన్నో ప్రయోగాలలో విజయం సాధించిన ఇస్రో కరోనా పై పోరాటంలో ప్రజలకు తమవంతు సాయం అందించడం అభినందించదగ్గ విషయం.