భారత్ లో 492కు చేరిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మంగళవారం ఉదయం 8:45 గంటల వరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 492కు చేరుకుంది. అంటే గత 24 గంటలలో సుమారు 100 కేసులో కొత్తగా నమోదయ్యాయి. కాగా, 36 మంది ఈ వ్యాధి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు పది మంది మృతి చెందారు. దేశంలో 25 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలలో లాక్ డౌన్ అమలు జరుపుతున్నారు. ఈశాన్య […]

Written By: Neelambaram, Updated On : March 24, 2020 4:28 pm
Follow us on

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మంగళవారం ఉదయం 8:45 గంటల వరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 492కు చేరుకుంది. అంటే గత 24 గంటలలో సుమారు 100 కేసులో కొత్తగా నమోదయ్యాయి.

కాగా, 36 మంది ఈ వ్యాధి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు పది మంది మృతి చెందారు. దేశంలో 25 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలలో లాక్ డౌన్ అమలు జరుపుతున్నారు.

ఈశాన్య రాష్ట్రాలలో తొలి కరోనా కేసు నమోదు అయింది. మణిపూర్‌కు చెందిన 23 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ యువతి ఇటీవలే యూకే నుంచి వచ్చింది.

మహారాష్ట్రలో అత్యధికంగా ఈ కేసుల సంఖ్య 101కు చేరుకుంది. కేరళలో 95 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 37, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్ లలో 33 చొప్పున, ఢిల్లీలో 31 చొప్పున నమోదయ్యాయి. ఢిల్లీలో గత 24 గంటలలో కొత్తగా ఒక కేసు కూడా నమోదు కాలేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

నిత్యవసర వస్తువులను కొనుగోలు చేసేందుకు కుటుంబం నుంచి ఒక్కరే బయటకు రావాలని పోలీసులు సూచిస్తున్నారు. అంతర్‌ రాష్ట్ర సరిహద్దులను ఇప్పటికే పోలీసులు మూసేశారు. కరోనా కట్టడికి అన్ని రాష్ర్టాల సీఎంలు, అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.