ఒక్కరి నుండి 100 మందికి సోకిన కరోనా వైరస్

లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి పక్షం రోజుల వరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు లేని గుంటూరు జిల్లా, నరసరావుపేట లో ఇప్పుడు ఈ వైరస్ 125 మందికి  వ్యాప్తి చెందింది. కేవలం నేరమయ నిర్లక్ష్యం కారణంగా, భౌతిక దూరం పాటించక పోవడంతో ఒక వ్యక్తి నుండే వందమందికి ఈ వైరస్ వ్యాప్తి చెందడం గమనార్హం. మొదట కరోనా కేసు వచ్చినప్పుడు అటు అధికారులు, ఇటు ప్రజలు పట్టించుకొనక పోవడంతో ఇప్పుడు అగ్గిరాజేసిన్నట్లు మొత్తం పట్టణాన్ని కాటేస్తున్నది. […]

Written By: Neelambaram, Updated On : May 2, 2020 2:59 pm
Follow us on


లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి పక్షం రోజుల వరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు లేని గుంటూరు జిల్లా, నరసరావుపేట లో ఇప్పుడు ఈ వైరస్ 125 మందికి  వ్యాప్తి చెందింది.

కేవలం నేరమయ నిర్లక్ష్యం కారణంగా, భౌతిక దూరం పాటించక పోవడంతో ఒక వ్యక్తి నుండే వందమందికి ఈ వైరస్ వ్యాప్తి చెందడం గమనార్హం. మొదట కరోనా కేసు వచ్చినప్పుడు అటు అధికారులు, ఇటు ప్రజలు పట్టించుకొనక పోవడంతో ఇప్పుడు అగ్గిరాజేసిన్నట్లు మొత్తం పట్టణాన్ని కాటేస్తున్నది. నెలరోజులుగా పట్టణ ప్రజలను అతలాకుతలం చేస్తున్నది.

వైకాపా క్రూర రాజకీయానికి కోడెల బలి: చంద్రబాబు

ఇప్పటికి 125 పాజిటివ్‌ కేసులు బయటపడగా, ప్రకటించాల్సిన కేసులు మరికొన్ని ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. గత నెల తొమ్మిదో తేదీన నరసరావుపేటలోని వరవకట్టలో నివసించే కేబుల్‌ కార్మికుడు మొదటగా కరోనా పాజిటివ్‌తో మృతి చెందాడు. అతను కేంద్రంగా ఇప్పటికే సుమారు వందమందికి ఈ వైరస్ వ్యాప్తి చెందింది.

గుంటూరు నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా ఇతనికి వైరస్‌ సోకినట్టు పోలీసులు నిర్ధారించారు. గుంటూరు వ్యక్తికి ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లిన వ్యక్తుల నుంచి కరోనా సోకిందని తేల్చారు. ఇతను నరసరావుపేట వరవకట్టకు రావటంతోనే వైరస్‌ వ్యాప్తి చెందింది.

పాజిటివ్‌ లక్షణాలు కనిపించగానే కేబుల్‌ కార్మికుడు చికిత్స పొందుతూ ఇంటి వద్దనో, ఆస్పత్రిలోనో ఉంటే సరిపోయేది. కానీ, ఆయన ఇతరులను కలిశాడు. ఈ క్రమంలో ఆయనకు సన్నిహితంగా ఉండే హోంగార్డుకు కరోనా పాజిటివ్‌ వచ్చింది.

లాక్ డౌన్ 3.0లో మందుబాబులకు శుభవార్త!

హోంగార్డు కాలికి ఇన్‌ఫెక్షన్‌ రావడంతో గత నెల 9వ తేదీకి ముందు నరసరావుపేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. ఇతనికి కరోనా పాజిటివ్‌ అని తెలియక వైద్యం అందించిన వైద్యులు కూడా కరోనా బారినపడ్డారు.

ఈ ఆస్పత్రి ద్వారా 14 మందికి వైరెస్‌ వ్యాప్తి చెందింది. వీరిలో ఐదుగురు వైద్యులు ఉన్నారు. మిగతావారు అక్కడ పనిచేసే స్టాఫ్‌ కాగా ఒక మహిళ చికిత్స పొందిన రోగి కుటుంబ సభ్యురాలు. ఈ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న పలువురికి కూడా వైరస్‌ సోకింది.

ఈపూరు మండలం కొండ్రముట్ల, మాచర్ల మండలం గిద్దలూరు ప్రాంతాలకు చెందినవారు ఈ ఆస్పత్రిలో చికిత్స పొందటం వలన సుమారు ఐదుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇలా వరవకట్ట, ప్రైవేట్‌ ఆస్పత్రి కేంద్రంగా మారటంతో ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు కరోనా కోరలు చాచింది.

వరవకట్టను వైరస్‌ పరీక్షల కోసం జల్లెడ పడుతున్నారు. దాదాపు 540 మందిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. కరోనా పరీక్షల కోసం 450 మంది నుంచి శాంపిల్స్‌ సేకరించారు. వరవకట్టలోనే ఇంకా పది కేసులకు పైగా ఉన్నట్టు అధికారులు చెపుతున్నారు. అయితే వీటిని ప్రకటించాల్సి ఉంది.