అసత్య ప్రచారాలపై ఉక్కుపాదం

కరోనా వైరస్‌ కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పని చేస్తుందని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు తెలిపారు. కరోనాని నియంత్రించడం కోసం ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలలు, పార్కులు, సినిమాహాళ్లు, మ్యూజియాలు మూసివేయాలని ఉత్తర్వులు జారీచేసిందని ప్రజలందరూ సహకరించాలని కోరారు. కరోనా వైరస్‌ వ్యాప్తిపై సోషల్‌ మీడియాలో అసత్యాలు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, ముఖ్యమంత్రి గారి ఆదేశాలమేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిదులులందరు తమ కార్యక్రమాలన్నిటిని […]

Written By: Neelambaram, Updated On : March 17, 2020 7:03 pm
Follow us on

కరోనా వైరస్‌ కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పని చేస్తుందని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు తెలిపారు. కరోనాని నియంత్రించడం కోసం ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలలు, పార్కులు, సినిమాహాళ్లు, మ్యూజియాలు మూసివేయాలని ఉత్తర్వులు జారీచేసిందని ప్రజలందరూ సహకరించాలని కోరారు. కరోనా వైరస్‌ వ్యాప్తిపై సోషల్‌ మీడియాలో అసత్యాలు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, ముఖ్యమంత్రి గారి ఆదేశాలమేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిదులులందరు తమ కార్యక్రమాలన్నిటిని రద్దు చేసుకున్నారని, అత్యవసర పనుంటే తప్ప ఎవరు కూడా మంత్రులను, ఎమ్మెల్యేలను కలవడానికి హైదరాబాద్ కు రావొద్దని విజ్ఞప్తి చేస్తూ, ఏమైనా ఇబ్బందులు ఉంటె ఫోన్ ద్వారా అందుబాటులో ఉంటామని తెలిపారు.

ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ ని కలిసి ఆశీస్సులు తీసుకున్న రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై విధంగా స్పందించారు.