సీఎంఓ బ్లాక్ కు పాకిన కరోనా..!

ఏపీ సచివాలయంలో కరోనా కలకలం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న బ్లాక్ కు కరోనా వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తోంది. సచివాలయంలో మొదటి బ్లాక్ లో సీఎంఓ, సాధారణ పరిపాలన శాఖ (జి.ఏ.డి)లు ఉన్నాయి. జి.ఏ.డిలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది ఒకరికి కరోనా సోకింది. దీంతో సీఎంఓ లో మరిన్ని జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆధికారులు, అక్కడి సిబ్బంది మినహా ఇతరులను అనుమతించడం లేదు. ఇప్పటికే మూడు, నాల్గవ బ్లాక్ లలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదు. […]

Written By: Neelambaram, Updated On : June 4, 2020 4:09 pm
Follow us on

ఏపీ సచివాలయంలో కరోనా కలకలం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న బ్లాక్ కు కరోనా వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తోంది. సచివాలయంలో మొదటి బ్లాక్ లో సీఎంఓ, సాధారణ పరిపాలన శాఖ (జి.ఏ.డి)లు ఉన్నాయి. జి.ఏ.డిలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది ఒకరికి కరోనా సోకింది. దీంతో సీఎంఓ లో మరిన్ని జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆధికారులు, అక్కడి సిబ్బంది మినహా ఇతరులను అనుమతించడం లేదు. ఇప్పటికే మూడు, నాల్గవ బ్లాక్ లలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదు.

కొద్ది రోజుల కిందట వ్యవసాయ శాఖ కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బందిలో ఒకరికి కరోనా సోకగా ఆ శాఖ ఉద్యోగులు అందరికీ కరోనా పరీక్షలు చేసి హోమ్ క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. వ్యవసాయ శాఖలో కరోనా సోకిన వ్యక్తి రూమ్ మేట్ గా ఉన్న సాధారణ పరిపాలన శాఖలోని ఉద్యోగికి తాజాగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

దీంతో సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నారు. వ్యవసాయ శాఖ తరహాలోనే వర్క్ ఫ్రం హోమ్ అమలుకు ఉద్యోగ సంఘాలు కోరుతున్నారు. మరోవైపు అసెంబ్లీ భద్రతా విధుల్లోని కానిస్టేబుల్‍కు కరోనా సోకడంతో అసెంబ్లీ సిబ్బందికి వర్క్ ఫ్రం హోమ్ కేటాయించారు. రెండ్రోజుల పాటు వర్క్ ఫ్రం హోమ్ విధుల నిర్వహణకు అసెంబ్లీ కార్యదర్శి ఇప్పటి కే ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఉద్యోగుల విధులకు హాజరైన కొద్దిరోజుల్లోనే సచివాలయంలో కరోనా మరోమారు ఉద్యోగులకు వర్క్ ప్రం హోమ్ ఆదేశాలు ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది.