జులై 1న కంపెనీ అత్యవసర అనుమతుల కోసం డీసీబీఐకి దరఖాస్తు చేసుకుంది. 12 ఏళ్లకు పైబడిన వారిపై తమ టీకా పనిచేస్తుందని తెలిపింది. టీకా చిన్నారులపై ప్రయోగాలు పూర్తయింది. ఇక పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్ సైతం త్వరలో పూర్తి కానున్నాయి. టీకా ఆమోదానికి అపెక్స్ డ్రగ్ రెగ్యులేటర్ కు ఆమోదానికి పంపించారు. అనుమతులు రాగానే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తామని చీఫ్ పేర్కొన్నారు.
ఇప్పటివరకు 12 ఏళ్లలోపు పిల్లలకే అమెరికా వ్యాక్సిన్లు ఫైజర్, మోడెర్నా వేసేందుకు అనుమతి వచ్చింది. ఈ రెండు ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఇక కొవాగ్జిన్ ట్రయల్స్ 12-18 ఏళ్లు, 6-12 ఏళ్ల చిన్నారులకు రెండు డోసుల టీకా ప్రయోగం పూర్తి చేశారు. ఇప్పటికే 2-6 ఏళ్ల మధ్య చిన్నారులకు తొలి డోసు టీకా ఇచ్చారు. రెండో డోసు టీకా ఇవ్వాల్సి ఉంది.
మనదేశంలో ఇప్పటివరకు 45.37 కోట్ల జనాభాకి వ్యాక్సినేషన్ పూర్తయింది. 11 కోట్ల డోసుల టీకాలు సద్ధంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూన్ 21 నుంచి దేశ వ్యాప్తంగా అందరికి ఉచిత టీకా అందిస్తున్నారు. దీంతో కరోనా రక్కసిని రూపు మాపే క్రమంల ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. థర్డ్ వేవ్ ప్రభావం చిన్నారులపై ఉంటుందనే హెచ్చరికలతో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం గమనార్హం.