https://oktelugu.com/

టీకాలు ముందే ఎలా వేస్తారు: జగన్ సర్కారుపై బీజేపీ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ విమర్శలకు దారి తీస్తోంది. దీనిపై బీజేపీ రాష్ర్ట శాఖ మండిపడుతోంది. కేంద్రం ఇచ్చిన టీకాలను తామే వేసినట్లు ప్రచారం చేసుకుంది. దీంతో ఒక్కరోజులో 13 లక్షల మందికి పైగా వేయడానికి అవసరమైన వ్యాక్సిన్లు రాష్ర్టాలకు సరఫరా చేసింది కేంద్రమే అన్న సంగతి చెప్పకుండా తమ ప్రభుత్వ ఘనతగా చెప్పుకోవడంపై బీజేపీ మండిపడుతోంది. ఇది కాస్త వైసీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీసినట్లయింది. వ్యాక్సినేషన్ డ్రైవ్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : June 22, 2021 / 03:37 PM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ విమర్శలకు దారి తీస్తోంది. దీనిపై బీజేపీ రాష్ర్ట శాఖ మండిపడుతోంది. కేంద్రం ఇచ్చిన టీకాలను తామే వేసినట్లు ప్రచారం చేసుకుంది. దీంతో ఒక్కరోజులో 13 లక్షల మందికి పైగా వేయడానికి అవసరమైన వ్యాక్సిన్లు రాష్ర్టాలకు సరఫరా చేసింది కేంద్రమే అన్న సంగతి చెప్పకుండా తమ ప్రభుత్వ ఘనతగా చెప్పుకోవడంపై బీజేపీ మండిపడుతోంది. ఇది కాస్త వైసీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీసినట్లయింది.

    వ్యాక్సినేషన్ డ్రైవ్ విషయంలో వైఎస్ జగన్ వక్రబుద్ధిని ప్రదర్శించారని బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. వ్యాక్సినేషన్లు కేంద్రమే పంపించిందనే విషయాన్ని విస్మరించారని ఆరోపించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోజున వ్యాక్సిన్ల కోసం కేంద్ర ప్రభుత్వం 9.56 లక్షల డోసుల టీకాలను రాష్ర్ట ప్రభుత్వానికి అందజేస్తే దాన్ని ముందే వాడేశారని ధ్వజమెత్తారు. యోగా దినోత్సవం నాటికి బదులుగా ముందే స్పెషల్ డ్రైవ్ పెట్టారని అన్నారు. నిర్దేశిత సమయం కంటే ముందే ఎలా వాడేస్తారని ప్రశ్నించారు.

    స్పెషల్ డ్రైవ్ సందర్భంగా యువతకు ఎందుకు వ్యాక్సిన్లు వేయలేదని సోము వీర్రాజు నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉచితంగా వ్యాక్సిన్లు తీసుకుని తామేదో ఘనకార్యం చేసినట్లు జగన్ సర్కారు ప్రచారం చేసుకుంటోందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు తాము వ్యాక్సినేషన్ కేంద్రాలను సందర్శించామని, ఎక్కడికెళ్లినా టీకాలు లేవనే సమాధానమే వినిపించిందని గుర్తు చేశారు. ఒక్క రోజు ముందే ఆదివారం ఎక్కువ టీకాలు వేసినట్లు సిబ్బంది చెప్పారన్నారు.

    ప్రధానమంత్రి మోడీ ఆదేశాలను జగన్ సర్కారు విస్మరించినట్లుందని వీర్రాజు ఆగ్రవేశాలు వ్యక్తం చేశారు. ఒక్క రోజులో13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేసినట్లు చెప్పుకుంటోందని, జగన్ వక్రబుద్ధికి అది నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఒక్క చోట కూడా ప్రధాని ఫొటో వాడలేదని, అన్ని కేంద్రాల్లో జగన్ చిత్రాలే కనిపించాయని మండిపడ్డారు. 18 సంవత్సరాలు దాటిన వారికి వ్యాక్సిన్ ఇవ్వాలంటూ మోడీ చేసిన సూచనలు సైతం జగన్ పట్టించుకోలేదని విమర్శించారు.