Corona Update: తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి తగ్గడం లేదు. కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. థర్డ్ వేవ్ భయాల నెలకొన్నా.. కాస్తా కుదుట పడేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీలో కరోనా కేసులు కాస్త శాంతిస్తున్నట్టు కనిపిస్తోంది. రోజురోజుకు కేసులు తగ్గుతుండడం ఊరటనిస్తోంది. ఫిబ్రవరి 15 తర్వాత పూర్తిగా థర్డ్ వేవ్ కంట్రోలోకి వస్తుందని అర్థమవుతోంది.
తాజాగా ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ లో గత 24 గంటల్లో 11573 కరోనా కేసులు నమోదైనట్టు పేర్కొన్నారు. అలాగే కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. సాధారణంగా 11 వేలకు పైగా కేసులు ఉంటే డేంజర్ బెల్స్ గా చెప్పొచ్చు. కానీ గత వారం రోజులతో పోల్చుకుంటే కేసుల సంఖ్య తగ్గిందనే చెప్పాలి. ఏపీలో మొన్నటివరకూ 15వేల మార్కుకు కేసులు చేరాయి. ఇప్పుడు 11వేలకు తగ్గాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం 1,15,425 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 46357 కోవిడ్ టెస్టులు చేశారు. శుక్రవారం ఒక్కరోజే 12516 కరోనా కేసులు.. 12 మరణాలు నమోదయ్యాయి. శనివారం ఆ సంఖ్య తగ్గింది. కేసుల సంఖ్య 11573కు చేరింది. 12 మరణాలు నమోదయ్యాయి. కేసుల సంఖ్య 11573కు, మరణాల సంఖ్య 3కు తగ్గింది. గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా చూస్తే కడప జిల్లాలో అత్యధికంగా 1942 కేసులు వచ్చాయి. కర్నూలు జిల్లాలో 1522, గుంటూరు జిల్లాలో 1298 కేసులు వెలుగుచూశాయి. మొన్నటివరకూ భయపెట్టిన చిత్తూరు, విశాఖ జిల్లాల్లో గతంతో పోలిస్తే కేసులు కంట్రోల్ అవుతూ ఉన్నాయి. నిత్యం కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.
-తెలంగాణలో 3590 మందికి పాజిటివ్
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 95355 నమూనాలను పరీక్షించగా.. 3590 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 7,58,566కు పెరిగింది. తాజాగా మహమ్మారి బారినపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో ప్రస్తుతం రికవరీ రేటు 94.13 శాతంగా ఉన్నట్లు బులిటెన్ లో పేర్కొంది. జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 1160మందికి పాజిటివ్ గా తేలింది.
మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కంట్రోల్ లోకి వచ్చినట్టే కనిపిస్తోంది. దేశంలో కూడా కేసుల తీవ్రత తగ్గడంతో ఫిబ్రవరి సగం వరకూ థర్డ్ వేవ్ తగ్గవచ్చన్న సూచనలు కనిపిస్తున్నాయి.