అమెరికా గుప్పిట్లో ‘కరోనా’ రహస్యాలు..?

ప్రపంచాన్ని నిద్ర లేకుండా చేసిన కరోనా వైరస్ పుట్టుక పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడి చైనా నుంచి పుట్టినదేనని ఇప్పటి వరకు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించినా అధికారికంగా ధ్రువీకరించలేదు. అయితే తాజాగా చైనాకు చెందిన ఓ ఉన్నతాధికారి ఆ దేశం నుంచి అమెరికాకు వెళ్లి కరోనా వైరస్ గురించి వివరాలు అందించినట్లు తెలుస్తోంది. దీంతో అమెరికా వైరస్ మూలాలపై ప్రత్యేక దృష్టి పెట్టి విచారణ ఆదేశించారని తెలుస్తోంది.  చైనాకు చెందిన ఆ ఉన్నతాధికారి […]

Written By: NARESH, Updated On : June 21, 2021 10:27 am
Follow us on

ప్రపంచాన్ని నిద్ర లేకుండా చేసిన కరోనా వైరస్ పుట్టుక పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడి చైనా నుంచి పుట్టినదేనని ఇప్పటి వరకు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించినా అధికారికంగా ధ్రువీకరించలేదు. అయితే తాజాగా చైనాకు చెందిన ఓ ఉన్నతాధికారి ఆ దేశం నుంచి అమెరికాకు వెళ్లి కరోనా వైరస్ గురించి వివరాలు అందించినట్లు తెలుస్తోంది. దీంతో అమెరికా వైరస్ మూలాలపై ప్రత్యేక దృష్టి పెట్టి విచారణ ఆదేశించారని తెలుస్తోంది.  చైనాకు చెందిన ఆ ఉన్నతాధికారి ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

చైనాలోని వూహాన్ లో వైరస్ బయటికొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ నగరంలోని వైరాలజీ ల్యాబ్ నుంచి వచ్చిందనడానికి ఆధారాలు లేవు. కానీ చైనా ప్రభుత్వంలోని ఓ కీలక అధికారి అయిన డాంగ్ జింగ్ వేయ్ ప్లేట్ ఫిరాయించి అమెరికాకు వెళ్లి వైరస్ గురించి కీలక సమాచారం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. డాంగ్ జింగ్ వేయ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్రటరీ విభాగంలో వైస్ మినిస్టర్ గా పనిచేస్తున్నాడు. శత్రు గూడచార్య కార్య కలాపాలను తిప్పి కొట్టడానికి ‘గువాన్ బు’ అనే గూడచార్య సంస్థకు అధిపతిగా ఉన్నాడు. అయితే ఆయన కొంతకాలంగా కనిపించడం లేదని చైనాలోని సోషల్ మీడియలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఆయన అమెరికాకు పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని చైనా నుంచి అమెరికాకు వలస వెళ్లిన హన్ లియాచావో ఈనెల 16న ట్వీట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో డాంగ్ కనిపించకపోవడంపై అమెరికా కూడా ఆందోళన చెందుతోంది. ఇక హాన్ లియాచావో తెలిపిన ప్రకాచం డాంగ్ జింగ్ వేయ్ తన కూమార్తెతో కలిసి ఫిబ్రవరిలోనే అమెరికాకు వెళ్లారని తెలిపారు. దీంతో మార్చిలో అమెరికా -చైనా సమావేశంలో డాండ్ అంశంపై చర్చించారు. ఆయనను అప్పగించాలని అమెరాకి విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకన్ నుంచి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కోరారు. అయితే అమెరికా ఈ విషయాన్ని పట్టించుకోలేదు.

డాంగ్ జియొంగ్ వద్ద చైనాకు చెందిన కీలక సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దేశానికి చెందిన ప్రత్యేక ఆయుద వ్యవస్థలు, వూహాన్ ల్యాబ్లో చైనా సైన్యం కార్యకలాపాలు, కొవిడ్ వైరస్ మూలాలు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఆయన ఇప్పటికే ‘టెరాబైట్ల కొద్దీ డేటా’ డీఏఏకు అందించినట్లు రెడ్ స్టేట్ అనే పత్రిక కథనం రాసింది. ప్రస్తుతం డాంగ్ జియోంగ్ అమెరికా డిఫెన్స్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ అదుపులో ఉన్నట్లు ‘స్పై టాక్ న్యూస్ లెటర్ ’ అనే పత్రిక కథనం రాసింది. దీంతో చైనాలోని వూహాన్ ల్యాబ్ లో పరిశోధనలకు సంబంధించిన మూలాలను చెరిపివేస్తున్నట్లు ఆ పత్రిక తెలిపింది.