TPCC President Revanth Reddy: కరోనా రక్కసి కోరలు చాస్తోంది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకు జడలు చాస్తోంది. గతంలో మాదిరిగా తన ప్రభావం చూపిస్తోంది. ఫలితంగా రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశరాజధాని ఢిల్లీ, మహారాష్ర్ట, కేరళ, బెంగాల్ తదితర స్టేట్లలో మహమ్మారి పడగ విప్పుతోంది. దీంతో రెండు రోజుల వ్యవధిలో
తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా కొవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని తన ట్విటర్ వేదికగా రేవంత్ ప్రకటించారు. దీంతో తనను కలిసిన వారందరు పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో ప్రజల్లో మళ్లీ ఆందోళన పెరుగుతోంది. గతంలో మాదిరిగానే కరోనా వేగం పెరగడంతో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి.

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కూడా శరవేగంగా విస్తరిస్తోంది. రోజుకు 1700 కేసులు నమోదు కావడంతో పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. తెలంగాణలో కూడా 67 కేసులు వెలుగు చూడటంతో ఒమక్రాన్ భయం పట్టుకుంది. మిగతా వైరస్ లలాగా ప్రమాదకరంగా లేకపోవడంతో భయపడొద్దని వైద్యులు సూచిస్తున్నా ప్రజల్లో ఆందోళన మాత్రం తగ్గడం లేదు.
Also Read: మొదట్లో చిరంజీవికి వీరాభిమాని.. కట్ చేస్తే మెగాస్టార్ కే బంపర్ హిట్లు ఇచ్చిన స్టార్ డైరెక్టర్..
దేశంలో ఒక రోజులోనే దాదాపు 33 వేల కేసులు వెలుగు చూడటం ఆశ్చర్యకరమే. ఇందులో పది వేలు డిశ్చార్జి అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో 1.45 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో కరోనా మహమ్మారి మరోమారు తన ప్రభావం చూపుతోందని తెలుస్తోంది. మూడో దశ ముప్పు ఉంటుందని శాస్ర్తవేత్తలు హెచ్చరికలు నిజమవుతున్నాయా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
Also Read: ఆర్ఆర్ఆర్ ఖాతాలో చెత్త రికార్డు.. ఆందోళనలో మూవీ యూనిట్..