Bala Krishna: బాలయ్య సినిమాలో విలన్ గా కన్నడ నటుడు… అఫిషియల్ అనౌన్స్ మెంట్ ?

Bala Krishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఓ వైపు సినిమాలు, మరో వైపు టాక్ షో కి హోస్ట్ గా చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు బాలయ్య. ఇటీవలే ‘అఖండ’ సినిమాతో వచ్చి భారీ విజయం సాధించాడు బాలకృష్ణ. ఈ సినిమా విడుదల అయి నెల రోజులు అవుతున్నా ఇంకా థియేటర్స్ ఫుల్ గా నడుస్తున్నాయి అంటే బాలయ్య మానియా ఎలాంటిదో అర్ధమవుతుంది. ఇక బాలయ్య తన తర్వాతి సినిమాని గోపీచంద్ […]

Bala Krishna: బాలయ్య సినిమాలో విలన్ గా కన్నడ నటుడు… అఫిషియల్ అనౌన్స్ మెంట్ ?

Bala Krishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఓ వైపు సినిమాలు, మరో వైపు టాక్ షో కి హోస్ట్ గా చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు బాలయ్య. ఇటీవలే ‘అఖండ’ సినిమాతో వచ్చి భారీ విజయం సాధించాడు బాలకృష్ణ. ఈ సినిమా విడుదల అయి నెల రోజులు అవుతున్నా ఇంకా థియేటర్స్ ఫుల్ గా నడుస్తున్నాయి అంటే బాలయ్య మానియా ఎలాంటిదో అర్ధమవుతుంది. ఇక బాలయ్య తన తర్వాతి సినిమాని గోపీచంద్ మలినేనితో అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.

interesting update from bala krishna and gopichand movie

ఇటీవలే ఈ చిత్రం ముహూర్తం కార్యక్రమాలు పూర్చి చేసుకొని లాంఛనంగా ప్రారంభమైంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక గత ఏడాది ‘క్రాక్’ సినిమాతో భారీ విజయాన్నందుకున్న గోపీచంద్ ఈ సారి బాలయ్యతోనూ హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. కాగా తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ప్రకటించారు మూవీ మేకర్స్.

https://twitter.com/MythriOfficial/status/1477861795389837313?s=20

ఈ సినిమాలో కన్నడ నటుడు దునియా విజ‌య్‌ ఓ కీలక పాత్ర చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కన్నడలో చిన్న పాత్రలతో సినిమా కెరీర్ ప్రారంభించాడు దునియా విజయ్. అతను హీరోగా నటించిన ‘దునియా’ సూపర్ హిట్ కావడంతో ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకుని తర్వాత వరుసగా సినిమాలు చేశాడు. ఇప్పటిదాకా దాదాపు నలభై సినిమాల్లో నటించాడు విజయ్. ఇటీవలే ‘సలాగా’ అనే సినిమాతో వచ్చి కన్నడలో మంచి విజయం సాధించాడు. నందమూరి అభిమానులు కోరుకునే అంశాలతో పాటు కమర్షియల్ హంగులతో సినిమాను రూపొందించనున్నట్టు తెలుస్తుంది.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు