జైలులో పెరోల్ వద్దంటున్న చిన్నమ్మ శశికళ

మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి, చిన్నమ్మగా పిలువబడే శశికళ బెయిల్ పై బయటకు పంపడానికి అధికారులు సిద్ధంగా ఉన్నా, ఆమె మాత్రం జైలులోనే ఉంటానని అంటున్నట్లు చెబుతున్నారు. తమిళ రాజకీయాలలో చక్రం తిప్పడం కోసం మొదట్లో బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కోర్టులు అంగీకరించలేదు. కానీ ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా ఖైదీలను ఉదారంగా బెయిల్ పై బయటకు పంపుతున్నారు. కానీ ఆమె జైలు లోపలనే తగు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకొంటూ గడపడానికి ఇష్ట పడుతున్నారు. […]

Written By: Neelambaram, Updated On : April 20, 2020 12:42 pm
Follow us on


మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి, చిన్నమ్మగా పిలువబడే శశికళ బెయిల్ పై బయటకు పంపడానికి అధికారులు సిద్ధంగా ఉన్నా, ఆమె మాత్రం జైలులోనే ఉంటానని అంటున్నట్లు చెబుతున్నారు. తమిళ రాజకీయాలలో చక్రం తిప్పడం కోసం మొదట్లో బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కోర్టులు అంగీకరించలేదు.

కానీ ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా ఖైదీలను ఉదారంగా బెయిల్ పై బయటకు పంపుతున్నారు. కానీ ఆమె జైలు లోపలనే తగు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకొంటూ గడపడానికి ఇష్ట పడుతున్నారు. బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఆమె ప్రస్తుతం వదినమ్మ ఇలవరసి, అబ్బాయి సుధాకరన్‌ లతో కలసి ఉండడం తెలిసిందే.

కరోనా కలవరం రెట్టింపు కావడంతో జైలులో మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటిస్తున్నారు. ఆమెను పేరోలపై బయటకు తీసుకు రావడానికి మక్కల్‌ మున్నేట్ర కళగం పార్టీ వర్గాలు ప్రయత్నం చేసినా ఆమె తిరస్కరించారు. ప్రస్తుత పరిస్థితులలో ఆమె ఉంటున్న జైలు నుంచి 1,112 మంది ఖైదీలు తాత్కాలిక బెయిల్, పెరోల్‌ మీద వెళ్లడంతో జైలులో దాదాపుగా అనేక గదులు, పరిసరాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

భోజనం కోసం బారులు తీరాల్సిన పరిస్థితి లేని దృష్ట్యా, తమకు కావాల్సింది తెచ్చుకుని ఆరగిస్తున్నారట. చిన్నమ్మ ఉన్న గదిలో అయితే ఇదివరకు ముగ్గురు ఉండేవారు. వారిలో ఒకరు పెరోల్‌ మీద బయటకు వెళ్లడంతో ప్రస్తుతం శశికళ, ఇలవరసి మాత్రమే ఉంటున్నారు. ఆమె జైలు నుండి బైటకు రాకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి.

ఇప్పుడు బైటకు వచ్చినా రాజకీయంగా తమిళనాడులో చేయగలిగింది ఏమీ ఉండదు. ఇప్పట్లో ఎన్నికలు అంటూ కూడా ఏమీ లేవు. పైగా రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఎటువంటి ప్రభావం చూపలేదు. బైటకు వచ్చిన కాలం మేరకు అదనంగా శిక్ష పూర్తి అయ్యేందుకు జైలులో గడపవలసి వస్తుంది.

వచ్చే సంవత్సరం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగవలసి ఉన్నాయి. ఆ లోపుగా శిక్షాకాలం పూర్తిచేసుకొని బైటకు వస్తే ఎన్నికలలో ప్రభావం చూపవచ్చని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి గత ఏడాదే `సత్ప్రవర్తన’ పేరుతో శిక్షాకాలం పూర్తి చేసుకొని ముందుగా జైలు నుండి బైటకు రావడానికి కర్ణాటలోని కాంగ్రెస్ ప్రభుత్వం సహకారంతో ప్రయత్నం చేశారు. కానీ అంతలో ఆ ప్రభుత్వం అస్థిరత్వానికి గురికావడంతో ఆమె ప్రయత్నాలు ఫలించలేదు.