ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం…!

రాష్ట్ర పాలనా యంత్రాంగంలో సమూల మార్పులు తీసుకువచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే గ్రామ స్థాయిలో 10 మందిని వివిధ శాఖలకు కార్యదర్శులు నియమించింది. వీరికి తోడు ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్లను నియమించింది. తాజాగా జిల్లా స్థాయిలో ఐఏఎస్ అధికారుల సంఖ్యను పెంచి వారికి బాధ్యతలను విభజించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఇకపై ప్రతి జిల్లాకు ముగ్గురు జాయింట్‌ కలెక్టర్లను నియమించనుంది. సీనియర్‌ టైమ్‌ స్కేలు ఉన్న ఐఏఎస్‌ అధికారులను జేసీలుగా […]

Written By: Neelambaram, Updated On : April 26, 2020 11:40 am
Follow us on


రాష్ట్ర పాలనా యంత్రాంగంలో సమూల మార్పులు తీసుకువచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే గ్రామ స్థాయిలో 10 మందిని వివిధ శాఖలకు కార్యదర్శులు నియమించింది. వీరికి తోడు ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్లను నియమించింది. తాజాగా జిల్లా స్థాయిలో ఐఏఎస్ అధికారుల సంఖ్యను పెంచి వారికి బాధ్యతలను విభజించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ క్రమంలో ఇకపై ప్రతి జిల్లాకు ముగ్గురు జాయింట్‌ కలెక్టర్లను నియమించనుంది. సీనియర్‌ టైమ్‌ స్కేలు ఉన్న ఐఏఎస్‌ అధికారులను జేసీలుగా నియమించి, ముగ్గురికీ పని విభజనలో సర్కారు స్పష్టత ఇవ్వనుంది. వీరు ముగ్గురు జిల్లా కలెక్టర్‌కు పాలన వ్యవహారాల్లో సహకారం అందిస్తారు. ఎందుకు సంభందించిన ఉత్తర్వులు నేడో, రేపో వెలువడే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు పలు సంక్షేమ పథకాల పర్యవేక్షణ బాధ్యత కొత్త జాయింట్ కలెక్టర్ లకు అప్పగించనున్నారు. మరింత జవాబుదారీతనం, అవినీతి రహిత పాలన, ప్రభుత్వ సేవలు సమర్ధవంతంగా, సజావుగా అందించాలన్నదే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.