https://oktelugu.com/

ఏపీలో కరోనా.. ఓ గొప్ప శుభపరిణామం

కరోనా మొదలైన కొత్తలో తెలంగాణలో భారీగా కేసులు నమోదు కాగా.. ఏపీలో మాత్రం తొలి దశలో కేసులే నమోదు కాలేదు. కానీ తర్వాత తెలంగాణలో సగటున 2వేల కేసులు నమోదు కాగా.. ఏపీలో మాత్రం మొన్నటి వరకు 10వేల కేసులు నమోదయ్యాయి. అయితే చాలా రోజులు రోజుకు 10వేల కేసులు నమోదు కాగా.. ఇప్పుడు ఏపీలో కరోనా తెరిపి ఇస్తోంది. కొద్దిరోజుల కిందటి వరకు రోజుకు 10వేల చొప్పున కేసులు నమోదైన ఏపీలో తాజాగా కరోనా తీవ్రత […]

Written By: , Updated On : September 30, 2020 / 08:31 PM IST
Follow us on

కరోనా మొదలైన కొత్తలో తెలంగాణలో భారీగా కేసులు నమోదు కాగా.. ఏపీలో మాత్రం తొలి దశలో కేసులే నమోదు కాలేదు. కానీ తర్వాత తెలంగాణలో సగటున 2వేల కేసులు నమోదు కాగా.. ఏపీలో మాత్రం మొన్నటి వరకు 10వేల కేసులు నమోదయ్యాయి. అయితే చాలా రోజులు రోజుకు 10వేల కేసులు నమోదు కాగా.. ఇప్పుడు ఏపీలో కరోనా తెరిపి ఇస్తోంది.

కొద్దిరోజుల కిందటి వరకు రోజుకు 10వేల చొప్పున కేసులు నమోదైన ఏపీలో తాజాగా కరోనా తీవ్రత తగ్గడం అందరికీ ఉపశమనం కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా ఏపీలో కరోనా కేసుల నమోదులో తగ్గుదల ఊరటనిస్తోంది. డిశ్చార్జీలు పెరుగుతున్నాయి. గతంతో పోలీస్తే ఏపీలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది.

ఏపీలో కరోనా మరణాల్లో కూడా తగ్గుదల కనిపించింది. కరోనా వైరస్ తో మరణించిన వారి సంఖ్య మళ్లీ భారీగా తగ్గిపోయాయి. బుధవారం ఏపీలో కరోనా బారినపడి మరణించిన వారిసంఖ్య 48గా నమోదైంది. దీంతో ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 5828కు పెరిగింది.

ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 6133 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 71806 టెస్టులు చేయగా దాదాపు 6వేల దాకా కేసులు వెలుగుచూశాయి. తాజాగా కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 6,93484కు పెరిగాయి.

ఇక తూర్పు , చిత్తూరు జిల్లాల్లో కరోనా వైరస్ మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తోంది. ఈ రెండు జిల్లాల్లో కలిపి రెండు లక్షలకు చేరువగా కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరిలో తాజాగా ఒక్కరోజులో 983 మందికి , చిత్తూరులో జిల్లాలో 925 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ రెండు జిల్లాలో ఏపీలో ఉధృతి తీవ్రంగా ఉంది.